
సంతోష్‌బాబు ఎంతో జాలి కలవాడు
సంతోష్‌బాబు 2016లో లెఫ్టినెంట్ కల్నల్‌గా, 2017లో కల్నల్‌గా పదోన్నతి పొందాడు. ఎక్కడ ఉన్నా రోజూ నాతో తప్పనిసరిగా మాట్లాడేవాడు. కొడుకుగా ఎంతటి పెద్దస్థానంలో ఉన్నా ఎప్పుడూ నాకు ఏదైనా పని చెప్తావా, నేనేమైనా సహాయం చేయాలా అమ్మ అని అడిగేవాడు. జాలి, దయ కలవాడు. 2020 జూన్ 14వ తేదీన మాకు మధ్యాహ్నం రెండు గంటలకు పిడుగులాంటి వార్త తెలిసింది. సంతోష్ ఇక లేడు అనే వార్తను టీవీలో చూస్తుండగానే వందల మంది మా ఇంటికి వచ్చారు. దేశం కోసం నా కొడుకు ప్రాణం అంకితం అయిందని గర్వపడ్డ క్షణాలు ఇంకా నా కళ్ల ముందు మెదలాడుతూనే ఉన్నాయి.