
నెట్‌బాల్ జిల్లా జట్టు ఎంపిక
నేటి నుంచి కల్యాణోత్సవాలు
మట్టపల్లి క్షేత్రంలో శనివారం నుంచి శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకళ్యాణోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
వాతావరణం
ఆకాశం పాక్షికంగా మేఘావృతమై
ఉంటుంది. ఎండ అధికంగా
ఉంటుంది.
స్వస్తి వాచనంతో శ్రీకారం
యాదగిరిగుట్టలో శ్రీనృసింహ స్వామి జయంతి ఉత్సవాలను శుక్రవారం స్వస్తి వాచనంతో ప్రారంభించారు.
- 10లో
నాగార్జునసాగర్ : నందికొండ మున్సిపాలిటీ పరిధిలోని హిల్‌కాలనీ సెయింట్‌జోసెఫ్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి సబ్ జూనియర్ నెట్‌బాల్ ఎంపిక పోటీలు ముగిశాయి. జిల్లా నెట్‌బాల్ అసోసియేషన్ సెక్రటరీ జె.కిరణ్‌కుమార్ పర్యవేక్షణలో నిర్వహించిన ఈ ఎంపిక పోటీల్లో 80 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. వారిలో ఉత్తమ ప్రతిభ కనపర్చిన క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. సబ్ జూనియర్ నెట్‌బాల్ అండర్–16 బాలికల విభాగంలో ఎంపికై న వారిలో జె.సుప్లవిరాజ్, ఎండీ.సభానూర్, బి.కీర్తన, బి.మహేశ్వరి, ఎస్‌కే రిజ్వానా, బి.కరుణ, ఎస్‌కే మహేకె, జె.దీక్షిత, ఆర్.సింధు, ఏ ఐశ్వర్య, సింధు, పూజ, బాలుర విభాగంలో పృద్వీరాజ్, వెంకటసాయి, నిఖిలేష్, నజీర్, మధు, చైతన్య, సత్యసాయి, కళ్యాణ్, సాత్విక్, కమల్‌తేజ్, కృష్ణ, బాలు ఉన్నారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 16, 17, 18 తేదీల్లో జనగాం జిల్లా బతుకమ్మ కుంట క్రీడా మైదానంలో జరిగే రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ నెట్‌బాల్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమంలో పాఠశాల హెచ్‌ఎం సిస్టర్ లలిత, నాయకులు రామకృష్ణారెడ్డి, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.