వైద్యసేవలు మెరుగయ్యాయి.. | - | Sakshi
Sakshi News home page

వైద్యసేవలు మెరుగయ్యాయి..

May 3 2025 8:23 AM | Updated on May 3 2025 8:45 AM

కాన్పుల సంఖ్య పెంచాలి

జిల్లాలోని అన్ని ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలి. ఆ దిశగా జిల్లా కలెక్టర్‌ ఆదేశాల మేరకు అన్ని కేంద్రాల్లో వైద్యులకు, సిబ్బందికి ఆదేశాలను జారీ చేశాం. అన్ని కేంద్రాల్లో కాన్పుల సంఖ్య పెంచాలని సూచించాం. వైద్యసిబ్బందికి ప్రజలు కూడా సహకరించాలి.

– డాక్టర్‌ పుట్ల శ్రీనివాస్‌, డీఎంహెచ్‌ఓ

నల్లగొండ టౌన్‌ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యసేవలు మెరుగయ్యాయి. జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, అర్బన్‌ హెల్త్‌ సెంటర్లు, పల్లె దవాఖానాలను ఆకస్మికంగా తనిఖీలు చేసిన కలెక్టర్‌ అన్ని కేంద్రాల్లో సిబ్బంది పనితీరు మెరుగుపడాలని, నిత్యం ప్రజలకు అందుడాటులో ఉంటూ వైద్యసేవలను అందించాలని ఆదేశిస్తున్నారు. దీనికితోడు డీఎంహెచ్‌ఓ కూడా తనిఖీలు చేస్తూ వైద్యాధికారులతో నిత్యం సమీక్షలను నిర్వహిస్తున్నారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ.. వైద్యులు, సిబ్బంది పీహెచ్‌సీలకు వచ్చే రోగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో వైద్యులు, సిబ్బంది పనితీరు మెరుగుపడింది. 24 గంటలు, 12 గంటల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వైద్యులతోపాటుగా ఏఎన్‌ఎంలు, ఇతర సిబ్బంది ఉదయం 9గంటలకే కేంద్రాలకు చేరుకుని ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు.

గతం కంటే సేవలు మెరుగు..

గతంలో కొన్ని కేంద్రాల్లో వైద్యులు, సిబ్బంది ఇష్టానుసారంగా అనుమతులు లేకుండా గైర్హాజరు కావడం, సమయపాలన పాటించకపోవడంతో సరైన వైద్యం ప్రజలకు అందని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం జిల్లా కలెక్టర్‌, డీఎంహెచ్‌ఓలు ప్రత్యేక దృష్టిసారించడంతో పరిస్థితి దానికి భిన్నంగా మారింది. కలెక్టర్‌ నిరంతర తనిఖీలతో వైద్యులు, సిబ్బంది పనితీరులో మార్పు వచ్చింది. దీంతో సకాలంలో విధులకు హాజరవుతున్నారు. ఫలితంగా ఆస్పత్రుల్లో ప్రసవాలు, ఏఎన్‌సీ నమోదు, ఓపి సేవలు, రక్త పరీక్షలు గణనీయంగా పెరిగాయి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కూడా అన్ని కేంద్రాల్లో ప్రజలకు అవసరమైన మందులను అందుబాటులో ఉంచుతోంది. మొత్తం మీద అధికారులు పరుగులు పెడుతూ వైద్యులను సిబ్బందిని పరుగులు పెట్టిస్తుండడంతో అన్ని ప్రాథధమిక ఆరోగ్య కేంద్రాల్లోలో వైద్యసేవలు మెరుగయ్యాయి.

ఈ చిత్రం మునుగోడు పీహెచ్‌సీలో మందుల కోసం క్యూకట్టిన జనం. ఈ పీహెచ్‌సీలో గతేడాది మార్చిలో 3,200 మందికి ఓపీ సేవలు అందించారు. ఇద్దరు మహిళలకు డెలివరీ చేశారు. 120 ఏఎన్‌సీ రిజిస్ట్రేషన్లు కాగా, 150 మంది నుంచి బ్లడ్‌శాంపిల్స్‌ సేకరించి పరీక్షలకు పంపించారు. ఈ ఏడాది మార్చి నెలలో 3,756 మందికి అవుట్‌ పేషెంట్లకు సేవలను అందించారు. ముగ్గురికి డెలివరీలు చేయగా 180 మందికి ఏఎన్‌సీ రిజిస్ట్రేషన్లు చేశారు. 224 మంది నుంచి రక్త నమూనాలు సేకరించి తెలంగాణ డయాగ్నొస్టిక్‌ హబ్‌కు పంపించినట్లు వైద్య ఆరోగ్యశాఖ గణాంకాలు చెబతున్నాయి. ఇలా జిల్లాలోని పీహెచ్‌సీల్లో వైద్యసేవలు మెరుగుపడ్డాయి.

ఫ ప్రజారోగ్యంపై కలెక్టర్‌ ప్రత్యేక ఫోకస్‌

ఫ ఆస్పత్రుల్లో తనిఖీలు.. వైద్యులతో సమీక్షలు

ఫ మారుతున్న సిబ్బంది తీరు

వైద్యసేవలు మెరుగయ్యాయి..1
1/1

వైద్యసేవలు మెరుగయ్యాయి..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement