ఫ ట్యాంకర్లకు గిరాకీ..
వాటర్ ట్యాంకర్లకు గిరాకీ పెరిగింది.వరి చేలు చేతికొచ్చే దశలో భూగర్భ జలాలు అండుగంటి పంటలు ఎండిపొతున్నాయి. దీంతో పంటలను కాపాడుకునేందుకు కొందరు రైతులు కొత్తగా బోర్లు వేస్తుండగా మరికొంత మంది గ్రామాల్లోని ట్యాంకర్ల ద్వారా నీటి తెచ్చి పంటలను కాపాడుకుంటున్నారు. ఇలా ప్రతి గ్రామంలో రైతులు ట్యాంకర్ల ద్వారా పంటలకు నీరు అందిస్తుండడంతో ట్యాంకర్ల యజమానులకు ఉపాధి లభిస్తోంది. వీరు ఒక్క ట్యాంకర్‌కు రూ.800 నుంచి రూ.1000 తీసుకుంటున్నారు. రోజుకు 8 నుంచి 10 ట్యాంకర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. ఇలా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేసి పంట పండిస్తే పెట్టుబడులు కూడా రావని రైతులు ఆవేదన చెందుతున్నారు. – మునుగోడు


