నల్లగొండ : నైపుణ్య శిక్షణ కార్యక్రమాల అమలుకు పక్కా ప్రణాళికలు రూపొందించాలని అదనపు కలెక్టర్ జె.శ్రీనివాస్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ఉపాధి కల్పన శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో వివిద శాఖల ద్వారా నైపుణ్య అభివృద్ధి, స్కిల్ డెవలప్‌మెంట్‌తో చేపట్టే కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహించాలన్నారు. ప్రస్తుత ట్రెండ్, డిమాండ్ ప్రకారం అవసరమైన కోర్సుల్లో యువతకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. సమావేశంలో ఉపాధి కల్పన అధికారి ఎన్.పద్మ, వివిద శాఖల అధికారులు పాల్గొన్నారు.