
పప్పు పంటలపై అనాసక్తి!
నల్లగొండ అగ్రికల్చర్ : పప్పు ధాన్యాలైన కంది, మినుము, బొబ్బర, పెసర, పంటల సాగు జిల్లాలో ఏటేటా తగ్గుతోంది. నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో కూడా సాగు చేసుకునే అవకాశం ఉన్నప్పటికీ రైతులు పప్పు ధాన్యాల పంటల సాగుకు ఆసక్తి చూపడంల లేదు. కేవలం దేవరకొండ డివి జన్‌లోని మండలాల్లో మాత్రమే పప్పు ధాన్యాల పంటలు సాగవుతున్నాయి. వాణిజ్య పంటలైన పత్తి, మిరప, ఆహార పంటలైన వరి మాత్రమే జిల్లాలో రైతులు పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. కేవలం వందల ఎకరాల్లో మాత్రమే పప్పు ధాన్యాల పంటలను సాగు చేస్తున్నారు. సాగు తగ్గడం వల్ల కంది, పెసర, మినుము తదితర పప్పుల ధరలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
గతంలో భారీగా సాగు
జిల్లాలో గతంలో రైతులు కంది, పెసర, మినుము, బొబ్బర్లు వంటి పప్పు ధాన్యాల పంటలను పెద్ద ఎత్తున సాగు చేసేవారు. కందులను లక్షల క్వింటాళ్లు పండించిన ఘన చరిత్ర జిల్లా రైతులకు ఉంది. అయితే పంట చేతికొచ్చిన తర్వాత వాటిని అమ్మడానికి అప్పటల్లో మార్కెటింగ్ సౌకర్యం లేక రైతులు ఇబ్బంది పడాల్సి వచ్చేది. అప్పటి ప్రభుత్వాలు కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినప్పటికీ సరైన మద్దతు ధర లేకపోవడం, డబ్బులు సకాలంలో ఇవ్వకపోయేవారు. పెసర్లు పండించినా అమ్ముకోవడానికి నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. పండించడం ఒక ఎత్తయితే వాటిని అమ్ముకోవడం మరో ఎత్తవుతుందని దీంతో పప్పు ధా న్యాల పంటలను తగ్గించి ఇతర ప ంటల వైపు మొగ్గు చూపుతున్నారు.
ప్రభుత్వం ప్రోత్సహించాలి
పప్పు ధాన్యాల పంటల సాగును రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సహించడంతోపాటు వాటిని అమ్మడానికి సరైన మార్కెటింగ్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉంది. రైతులకు సబ్సిడీపై విత్తనాలు, ఎరువులను అందించడంతో పాటుగా పంటల సాగుపై పెద్ద ఎత్తున అవగాహన కల్పించి ప్రోత్సహిస్తే పప్పు ధాన్యాల పంటల సాగు పెరిగే అవకాశం ఉంటుందని రైతులు అభిప్రాయ పడుతున్నారు.
వర్షాధారంగా సాగు చేసుకోవచ్చు
జిల్లాలో కంది, పెసర, మినుము, బొబ్బర్లు వంటి పప్పు ధాన్యాల పంటలు సాగు చేసే విధంగా రైతుల్లో అవగాహన కల్పించి ప్రోత్సహిస్తాం. సాగు తగ్గడం వల్ల పప్పు ధాన్యాల ధరలు పెరిగే ప్రమాదం ఉంటుంది. మెట్ట ప్రాంతాల్లో వర్షాధారంగా ఈ పంటలు సాగు చేయవచ్చు.
– పాల్వాయి శ్రవణ్‌కుమార్,
డీఏఓ నల్లగొండ
ఫ జిల్లాలో ఏటేటా తగ్గుతున్న
పప్పుధాన్యాల సాగు
ఫ పత్తి, వరి, మిర్చి పంటలపైనే
రైతుల ఆసక్తి
ఫ పప్పు పంటల సాగుపై
అవగాహన కల్పించని అధికారులు
ఫ సబ్సిడీపై అందని విత్తనాలు, ఎరువులు
2020 నుంచి జిల్లాలో పప్పు ధాన్యాల సాగు ఇలా....(ఎకరాల్లో)
సంవత్సరం సీజన్ కంది మినుము పెసర
2020 వానాకాలం 21,154 76 1,044
యాసంగి –– 230 757
2021 వానాకాలం 10,807 8 329
యాసంగి 28 1,214 2,213
2022 వానాకాలం 3,273 38 88
యాసంగి 5 55 1,252
2023 వానాకాలం 942 76 548
యాసంగి 176 203 649
2024 వానాకాలం 2,479 526 1,130

పప్పు పంటలపై అనాసక్తి!