
పుష్పాంజలి ఘటిస్తున్న ఇంజనీర్లు
నాగార్జునసాగర్: ఆధునిక దేవాలయంగా విరాజిల్లుతున్న నాగార్జునసాగర్ డ్యాం స్వదేశీ పరిజ్ఞానంతోనే నిర్మాణమైందని ప్రాజెక్టు డీఎస్‌ఈ నాగేశ్వర్‌రావు అన్నారు. సాగర్ ప్రాజెక్టు నిర్మాణానికి ఆనాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన చేసి 68సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఆదివారం పైలాన్ కాలనీలోని శంకుస్థాపన ఫిల్లర్ వద్ద పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లక్షలాది మంది కూలీలు, వందలాది మంది ఇంజనీరింగ్ నిపుణులు, కాంట్రాక్టర్లు ఒక యజ్ఞంలా భావించి రేయింబవళ్లు కష్టపడి 12 సంవత్సరాల్లో డ్యాం నిర్మాణం పూర్తి చేశారని పేర్కొన్నారు. వారి శ్రమ ఫలితంగానే నేడు రెండు తెలుగు రాష్ట్రాలకు తాగు, సాగునీరు అందుతోందన్నారు. ఈ కార్యక్రమంలో డ్యాం ఈఈ మల్లిఖార్జున్, డీఈలు సుదర్శన్, శ్రీనివాస్, జేఈ కృష్ణయ్య, ఏఈ సత్యనారాయణ, భిక్షమయ్య తదితరులు పాల్గొన్నారు.