నల్లగొండ: కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని కార్పొరేషన్ పదవులను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి పదవులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వివిధ కార్పొరేషన్ పదవుల్లో కొనసాగుతున్న ఎనిమిది మంది నేతల పదవులు రద్దయ్యాయి. ఉమ్మడి జిల్లాకు చెందిన ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్‌మెంట్ చైర్మన్ తిప్పన విజయసింహారెడ్డి, కోఆపరేటివ్ ఆయిల్ సీడ్స్ డెవలప్‌మెంట్ పెడరేషన్ చైర్మన్ల కంచర్ల రామకృష్ణారెడ్డి, షీప్ అండ్ గోట్స్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు, డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సోమా భరత్, గీత కార్మొరేషన్ చైర్మన్ పల్లె రవికుమార్‌గౌడ్, ట్రైబల్ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ రామచంద్రనాయక్, ఫుడ్ డెవలప్‌మెంట్ సొసైటీ చైర్మన్ మేడి రాజీవ్‌సాగర్, తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరి గౌరీశంకర్ పదవులు కోల్పోయారు. వీరితోపాటు పలువురు వైస్ చైర్మన్ల పదవులు కూడా రద్దయ్యాయి.