
సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు
భానుపురి (సూర్యాపేట): ఎనిమిది గంటల పని విధానాన్ని అమలు చేసి పెన్షన్‌తోపాటు అన్నిరకాల సదుపాయాలు కల్పించాలని డిమాండ్ చేస్తూ తపాలా శాఖ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఈ నెల 12 నుంచి చేపట్టనున్న నిరవధిక సమ్మెను విజయవంతం చేయాలని ఆ శాఖ ఉద్యోగుల సంఘం సూర్యాపేట డివిజన్ కన్వీనర్ జి.నాగరాజు, చైర్మన్ రవి పిలుపునిచ్చారు. శనివారం సూర్యాపేటలోని సబ్ పోస్టాఫీస్ వద్ద ఏర్పాటు చేసిన సమ్మె సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. సీనియర్ జీడీఎస్ ఉద్యోగులకు 12, 24, 36 సంవత్సరాల సర్వేస్‌కు అదనపు ఇంక్రిమెంట్లు చేసి ఆర్థిక ఉన్నతి కల్పించాలని, గ్రూప్ ఇన్సూరెన్స్, గ్రాడ్యుటీ ఇన్సూరెన్స్ రూ.5 లక్షలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో లింగయ్య, పుల్లయ్య, సత్యం, కరుణాకర్, శుక్య, దివ్య, అఖిల, మేరి, నౌసిన్, చికిత గోపి, మల్లయ్య, ఆంజనేయులు, ప్రేమ్, లావణ్య, వెంకటరమణారెడ్డి, శ్రావణ్, వెంకటాచారి తదితరులు పాల్గొన్నారు.