నల్లగొండ: పోలింగ్ రోజు మైక్రో అబ్జర్వర్లు విధులు సమర్థవంతంగా నిర్వహించాలని శిక్షణ నోడల్ అధికారి రాజ్‌కుమార్ అన్నారు. గురువారం నల్లగొండ కలెక్టరేట్‌లో మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల సామగ్రి పంపిణీ కార్యక్రమంలో మైక్రో అబ్జర్వర్లు పాల్గొనాలని సూచించారు. పోలింగ్ రోజు మాక్ పోలింగ్ నిర్వహణలో 50 ఓట్లు వేశారా? లేదా అనే విషయాన్ని పరిశీలించి రిటర్నింగ్ అధికారులకు తెలియపరచాలన్నారు. పోలింగ్ ప్రారంభం నుంచి పోలింగ్ సరళిని పర్యవేక్షించాలన్నారు. ఈ సందర్భంగా పలు విషయాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మైక్రో అబ్జర్వర్లకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మైక్రో అబ్జర్వర్ల నోడల్ అధికారి శ్రామిక్, శిక్షణ నోడల్ అధికారి వెంకయ్య తదితరులు పాల్గొన్నారు.