
సమావేశంలో మాట్లాడుతున్న శంకర్‌నాయక్
దేవరకొండ : సీఎల్పీ నేత భట్టి విక్రమార్క చేపట్టిన పీపుల్స్ మార్చ్ యాత్రను విజయవంతం చేయాలని డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్ పిలుపునిచ్చారు. శుక్రవారం దేవరకొండలో మాజీ ఎమ్మెల్యే నేనావత్ బాలూనాయక్ అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 7వ తేదీన చందంపేట మండలం తెల్దేవర్‌పల్లి నుంచి యాత్ర ప్రారంభమై 10వ తేదీ వరకు దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట, నేరేడుగొమ్ము, దేవరకొండ, కొండమల్లేపల్లి మండలాల మీదుగా సాగుతుందని ఆయన తెలిపారు. సమావేశంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు వడ్త్య రమేశ్‌నాయక్, పీసీసీ సభ్యులు జాల నర్సింహారెడ్డి, దూదిపాళ్ల వేణుదర్‌రెడ్డి, ఎంఏ.సిరాజ్‌ఖాన్, ఎండీ.యూనుస్, భవాని పవన్‌కుమార్, దూదిపాళ్ల రేఖశ్రీధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
డీసీసీ అధ్యక్షుడు శంకర్‌నాయక్