
మాట్లాడుతున్న అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు
నల్లగొండ టౌన్ : ‘నాది పేద కుటుంబమే.. కష్టాలంటే ఏంటో తెలుసు.. అవి చూసి తల్లిదండ్రులు పడే బాధ తెలుసు. అందుకే కష్టపడి చదివి నేడు జిల్లా అదనపు కలెక్టర్ స్థాయికి వచ్చాను. మీరు నాలాంటి పేద పిల్లలే గురిపెట్టి చదివి లక్ష్యాన్ని సాధించి కన్నవారి కలలు సహకారం చేయాలి’ అని అదనపు కలెక్టర్ భాస్కరరావు సూచించారు. శుక్రవారం నల్లగొండలోని ఎంవీఎన్ విజ్ఞాన కేంద్ర గ్రంథాలయంలో పోటీ పరీక్షల కోసం చదువుతున్న అభ్యర్థులకు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తాను హాస్టల్‌లో ఉండి ఎంతో కష్టపడి చదివానని చెప్పారు. ప్రతి ఒక్కరూ మూస పద్ధతిలో కాకుండా శ్రద్ధతో చదవాలని సూచించారు. ప్రతి ఒక్కరికీ చదువుకోవడానికి ఒక వసతి కావాలని ఆ అవకాశాన్ని ఎంవీఎన్ విజ్ఞాన కేంద్రం అందిస్తోందని.. చెప్పారు. పుస్తకాలను ఉచితంగా అందిస్తున్న విజ్ఞాన కేంద్ర నిర్వాహకులను ప్రశంసించారు. కార్యక్రమంలో ట్రస్టు సభ్యులు ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, ట్రస్ట్ కార్యనిర్వాహక కార్యదర్శి పి.నర్సిరెడ్డి, కన్వీనర్ అక్కెనపల్లి మీనయ్య, తుమ్మల వీరారెడ్డి, పాలడుగు నాగార్జున, సయ్యద్ హశం, బండ శ్రీశైలం, ప్రభావతి, పొట్టబత్తిని యాదగిరి, నరేష్, శంకర్ పాల్గొన్నారు.
గురిపెట్టి చదివితే లక్ష్యం సాధించవచ్చు
అదనపు కలెక్టర్ భాస్కర్‌రావు