ట్రిబ్యునల్‌ తీర్పు అమలు చేయకుంటే కఠిన చర్యలు

కేసులను విచారిస్తున్న  
ట్రిబ్యునల్‌ చైర్మన్‌ వెంకట ఉపేందర్‌రెడ్డి - Sakshi

చౌటుప్పల్‌ : ట్రిబ్యునల్‌ తీర్పు అమలు చేయకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని వృయో వృద్ధులు, సీనియర్‌ సిటిజన్‌ ట్రిబ్యునల్‌ చైర్మన్‌ కంచర్ల వెంకట ఉపేందర్‌రెడ్డి అన్నారు. తమ పోషణను పట్టించుకోవడం లేదంటూ వలిగొండ మండలం గొల్లేపల్లి గ్రామానికి చెందిన జోగు శంకరయ్య, చౌటుప్పల్‌ మండలంలోని ఆరెగూడెం గ్రామానికి చెందిన పోగుల లక్ష్మమ్మ ఇటీవల ట్రిబ్యునల్‌లో చేసిన ఫిర్యాదు మేరకు సోమవారం విచారణ నిర్వహించారు. ఫిర్యాదుదారులతో పాటు వారి కుమారులను పిలిచి వాదనలు విన్నారు. జోగు శంకరయ్యకు ఇద్దరు కుమారులు నెలకు 4వేల వంతున, పోగుల లక్ష్మమ్మకు ఇద్దరు కుమారులు నెలకు 3వేల చొప్పున పోషణ ఖర్చులకు చెల్లించాలని తీర్పునిచ్చారు. ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ ట్రిబ్యునల్‌ తీర్పును తూచా తప్పకుండా పాటించాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. జన్మనిచ్చి పెంచి పోషించిన తల్లిదండ్రులను కడవరకు కంటికి రెప్పలా చూసుకోవాలన్నారు. ఫిర్యాదులు చేసే పరిస్థితులు తల్లిదండ్రులకు కల్పించొద్దన్నారు. తల్లిదండ్రుల పట్ల ప్రస్తుతం తాము అవలంభిస్తున్న కఠిన వైఖరి భవిష్యత్తులో తమవరకు రాకుండా చూసుకోవాలన్నారు. విచారణలో ట్రిబ్యునల్‌ సభ్యుడు, న్యాయవాది ముత్యాల సత్తిరెడ్డి, సెక్షన్‌ అధికారి సురేంద్రశర్మ, తదితరులు ఉన్నారు.

ఫ వృయో వృద్ధులు, సీనియర్‌ సిటిజన్‌

ట్రిబ్యునల్‌ చైర్మన్‌ వెంకట ఉపేందర్‌రెడ్డి

Read latest Nalgonda News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top