
రసాయన ఎరువుల వినియోగం తగ్గించాలి
తాడూరు: రైతులు సాగు చేసే పంటల్లో యూరియాతో పాటు రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గించాలని పాలెం కేవీకే శాస్త్రవేత్త శ్రీరాం అన్నారు. సోమవారం మండలంలోని బలాన్‌పల్లిలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు కార్యక్రమంలో భాగంగా పంటల సాగుపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పంట మార్పిడితో భూ సారం పెరుగుతుందన్నారు. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేసినప్పుడు రసీదులు భద్రపర్చుకోవాలని సూచించారు. శాస్త్రవేత్త రాజిరెడ్డి మాట్లాడుతూ.. పురుగు మందులు అవసరం ఉన్నప్పుడే మాత్రం పిచికారీ చేయాలన్నారు. నేల, తేమ సంరక్షణ పద్ధతులపై అవగాహన కల్పించారు. అధికారుల సూచనలు, సలహాలు పాటించి అధిక దిగుబడులు పొందాలని కోరారు. కార్యక్రమంలో ఏఓ సందీప్‌కుమార్‌రెడ్డి, ఏఈఓ దీపక్, వ్యవసాయ కళాశాల విద్యార్థులు రైతులు పాల్గొన్నారు.