
పది స్థానం మెరుగు
టెన్త్ ఫలితాల్లో
96.83 శాతం ఉత్తీర్ణత
● 23 నుంచి 13వ స్థానానికి
చేరిన జిల్లా స్థానం
● బాలికలదే పైచేయి..
●
కందనూలు: పదోతరగతి వార్షిక పరీక్ష ఫలితాల్లో జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి బుధవారం విడుదలైన ఫలితాల్లో బాలుర కంటే బాలికలే పై చేయి సాధించారు. జిల్లావ్యాప్తంగా 10,530 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా.. 10,196 మంది పాసవ్వగా.. 96.83 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 5,230 మంది బాలురుల్లో 5,013 మంది, 5,300 మంది బాలికల్లో 5,183 మంది ఉత్తీర్ణత సాధించారు. బాలురు 95.85 శాతం, బాలికలు 97.79 శాతం ఉత్తీర్ణులయ్యారు.
పెరిగిన ర్యాంకు..
2023–24 విద్యాసంవత్సరంలో ఉత్తీర్ణత శాతం 91.57 ఉండగా.. 2024–25లో 96.83 శాతానికి చేరింది. అంటే 5 శాతం మెరుగుపడింది. గతేడాది రాష్ట్రంలో 23వ స్థానం ఉండగా.. ఈసారి 13వ స్థానానికి చేరింది.
విద్యా విద్యార్థుల పాసైంది ఉత్తీర్ణత ర్యాంకు
సంవత్సరం సంఖ్య శాతం
2021–22 10,937 10,171 93.34 16
2022–23 10,545 9,582 90.87 12
2023–24 10,507 9,621 91.57 23
2024–25 10,530 10,196 96.83 13
ఫలితాలు సంతృప్తికరం..
పదోతరగతి ఫలితాల్లో రాష్ట్రంలో జిల్లా 13వ స్థానంలో నిలిచింది. గతేడాది 23వ స్థానంలో ఉండగా ఈసారి 10 స్థానాలు పైకి చేరింది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయు లు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంతో పాటు ప్రత్యేక తరగతులు, నిత్యం పరీక్షల నిర్వహణతోనే సాధ్యమైంది.
– రమేష్‌కుమార్,
జిల్లా విద్యాధికారి