
ప్రహసనంగా హాజరు ప్రక్రియ..
జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో కొందరు ఉపాధ్యాయులు సమయపాలన పాటించడం లేదన్న ఫిర్యాదులు తరచుగా వస్తున్నాయి. కొన్ని పాఠశాలల్లో మాత్రమే బయోమెట్రిక్ ఉండగా, అది కూడా ఎక్కడా పకడ్బందీగా అమలు కావడం లేదు. మారుమూల గ్రామాల్లోని పాఠశాలలకు ఉపాధ్యాయులు వెళ్లడం లేదని ఫిర్యాదులు అందుతున్నాయి. కొన్నిచోట్ల ఉదయం, సాయంత్రం పాఠశాలల్లో హాజరు వేసుకుని మిగతా సమయం అంతా బయటకు వెళ్లి వ్యాపార, ప్రవృత్తి రంగాల్లో నిమగ్నమవుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. పాఠశాలల్లో ఉపాధ్యాయుల హాజరును పర్యవేక్షించాల్సిన అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.