
అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి
నాగర్‌కర్నూల్ క్రైం: షాపింగ్‌మాల్స్, ఆస్పత్రులు, సినిమా థియేటర్లతోపాటు పెద్ద భవనాలకు అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణమూర్తి అన్నారు. అగ్నిమాపక వారోత్సవాల్లో భాగంగా గురువారం జిల్లాకేంద్రంలోని ఓ షాపింగ్‌మాల్‌లో అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు వెంటనే అదుపు చేసేందుకు అగ్నిమాపక పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అగ్నిమాపక శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలని, లేకపోతే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో లీడ్ ఫైర్‌మెన్లు రంగస్వామి, వహీద్ పాల్గొన్నారు.