
వాటర్ షెడ్ యాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు
నాగర్‌కర్నూల్: ప్రధానమంత్రి కృషి సంచాయ్ యోజనలో భాగంగా ఈ నెల 23న వాటర్ షెడ్ యాత్ర ఉప్పునుంతల, బీకే లక్ష్మాపూర్ గ్రామాల్లో నిర్వహిస్తున్నట్లు అదనపు కలెక్టర్ దేవసహాయం తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లోని అదనపు కలెక్టర్ చాంబర్‌లో వాటర్ షెడ్ యాత్రపై సంబంధి త శాఖ అధికారులతో దేవసహాయం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ఎంపీ, కలెక్టర్, ఎమ్మెల్యే పాల్గొననున్న వాటర్ షెడ్ యాత్రకు అధికారులు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలన్నారు. వాటర్ షెడ్‌లు మన నీటి వనరులు, పర్యావరణానికి కీలకమైనవని, వాటిని సమర్థవంతంగా నిర్వహించడం చాలా ముఖ్యమని, వాటర్ షెడ్ల ప్రాముఖ్యత, పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను అధికారులకు వివరించారు. వాటర్ షెడ్ పథకంపై ప్రజల్లో అవగాహన కలిగించేందుకు సంబంధిత అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. భూ, నీటి సంరక్షణ, గ్రామీణ ప్రజల జీవనోపాధి మెరుగు కోసం ఉద్దేశించిన వ్యవసాయ సంబంధమైన పండ్ల తోటల పెంపకం, అధునాతన సాంకేతిక వ్యవసాయ పద్ధతి ద్వారా వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడానికి ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. అటవీ సంరక్షణలో భాగంగా వాటర్‌షెడ్ ప్రాంతాల్లో చెట్లను నరకకుండా చూడటంతోపాటు కొత్త మొక్కలను నాటాలని, నేల కోతను నివారించడానికి సరైన వ్యవసాయ పద్ధతులు, నీటిని వృథా చేయకుండా పొదుపుగా వాడాలని, వర్షపు నీటిని సంరక్షించుకొని భవిష్యత్ తరాలకు అందించాలన్న ముఖ్య లక్ష్యంతో చేపట్టనున్న వాటర్ షెడ్ యాత్రను విజయవంతం చేయాలని కోరారు. వాటర్ షెడ్ యాత్రలో విద్యార్థులు, యువత, ప్రజలు, ప్రజాప్రతినిధులను భాగ స్వాములు చేయాలన్నారు. పాఠశాలల్లో వాటర్ షెడ్ పథకంపై విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యా స, చిత్రలేఖన పోటీలు నిర్వహించాలని సూచించారు. వాటర్ షెడ్ యాత్రపై స్టాళ్లు ఏర్పాటు చేయా లని, మొక్కలు నాటే కార్యక్రమం, చెక్‌డ్యాం నిర్మా ణానికి భూమిపూజ తదితర పనులు వెంటనే పూర్తిచేయాలన్నారు. సమావేశంలో డీఆర్‌డీఓ చిన్న ఓబులేషు, జిల్లా వ్యవసాయ అధికారి చంద్రశేఖర్, పంచాయతీ అధికారి రామ్మోహన్‌రావు, ఉద్యానవన శాఖ అధికారి జగన్ తదితరులు పాల్గొన్నారు.