ములుగు రూరల్: తెలంగాణ వీర భద్రియ కులసంఘం జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఆదివారం నిర్వహించిన సమావేశానికి ఉమ్మడి వరంగల్ జిల్లా ఎలక్షన్ కమిటీ ఎన్నికల కార్యనిర్వహణ అధికారి రాజయ్య, కన్వీనర్లు శివకుమార్, రాములు, ఎల్లయ్య, సత్తయ్య హాజరయ్యారు. వారి సమక్షంలో కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా బానాల రాజ్‌కుమార్, వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బానాల సాంబయ్య, గౌరవ సలహాదారులుగా చంద్రమౌళి, కొమురయ్య, కనకయ్య, ప్రధాన కార్యదర్శిగా తిరుపతి, కోశాధికారిగా రామకృష్ణ, ఉపాధ్యక్షులుగా సంతోష్ తదితరులను ఎన్నుకున్నారు.
‘ప్రసాదాల విక్రయంలో నిర్లక్ష్యం’
మంగపేట : రెండో యాదగిరిగుట్టగా ప్రసిద్ధి గాంచిన మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయంలో భక్తులకు ప్రసాదాలను విక్రయించడంలో అధికారులు, సిబ్బంది పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పెసా మొబిలైజర్ తాటి విజయ్‌బాబు ఆదివారం ఒక్క ప్రకటనలో ఆరోపించారు. నిత్యం వందల సంఖ్యలో వచ్చే భక్తులకు ఆలయంలో విక్రయించే లడ్డు, పులిహోర ప్రసాదాలు లభించకపోవడంతో భక్తుల ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. ఆలయ సిబ్బందితో పాటు మల్టీపర్పస్ సిబ్బందితో కలిసి 15 మంది ఉన్నా నెలనెలా వేతనాలు తీసుకుని ఎంజాయ్ చేస్తున్నారనే తప్ప ప్రసాదాల తయారీ, విక్రయాల పట్ల పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఆలయంలో పూజ సామగ్రితో పాటు హోటళ్లు, బొమ్మల షాపులకు వేలంపాట నిర్వహించిన అధికారులు గతంలో మాదిరిగా లడ్డు, పులిహోర విక్రయాలకు వేలం పాట పెడితే ఆలయానికి ఎంతో ఆదాయం వచ్చేదని వెల్లడించారు. అధికారులు ఇప్పటికై నా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
నీట్ ప్రశాంతం
భూపాలపల్లి అర్బన్: జిల్లా కేంద్రంలో రెండు పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన నీట్ ప్రవేశ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసిందని సిటీ నీట్ కోఆర్డినేటర్ డాక్టర్ రమణారావు తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5:15 గంటల వరకు పరీక్ష నిర్వహించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 168 మంది విద్యార్థులకు 147మంది విద్యార్థులు హాజరుకాగా 21 గురు గైర్హాజరయ్యారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 220 మంది విద్యార్థులకు 194 మంది హాజరు కాగా 26 గురు గైర్హాజరయ్యారు. విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. 11 గంటల నుంచి విద్యార్థులు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులను క్షణంగా తనిఖీ చేసిన అనంతరం కేంద్రంలోనికి అనుమతించారు. పరీక్ష కేంద్రాలను అడిషనల్ ఎస్పీ నరేష్‌కుమార్ పరిశీలించారు.
సైబర్ నేరాలపై
అప్రమత్తంగా ఉండాలి
రేగొండ: సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీఐ కరుణాకర్ రావు సూచించారు. ఆదివారం కొత్తపల్లిగోరి మండల కేంద్రంలో ఎస్సై సాయి త్రిలోక్‌నాథ్ రెడ్డి ఆధ్వర్యంలో కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరు సైబర్ నేరాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. సైబర్ బాధితులు 1930 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మైనర్లకు వాహనాలు ఇచ్చిన తల్లిదండ్రులపై కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాహనదారులు సరైన పత్రాలు కలిగి ఉండి, రోడ్డు భద్రత నియమాలు పాటించాలని తెలిపారు. గ్రామంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రతీ ఒక్కరు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో సెకండ్ ఎస్సై హేమ, సర్పంచ్ చల్లగురుగుల సుదర్శన్, ఉప సర్పంచ్ ఆకుతోట తిరుపతి, గ్రామస్తులు పాల్గొన్నారు.


