వ్యవసాయ పనుల్లో రైతన్న నిమగ్నం | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ పనుల్లో రైతన్న నిమగ్నం

Jun 22 2026 1:12 AM | Updated on Jun 22 2026 1:12 AM

మహాముత్తారం: రెండు రోజుల క్రితం మండలంలో భారీ వర్షం కురిసింది. దీంతో మండలంలోని బోర్లగూడెం, మీనాజీపేట, కనుకునూర్‌, సింగారం, గండికామారం గ్రామాల్లోని రైతులు బోరుబావుల కింద నారుమడులు తయారు చేసి వరినారు కోసం మొలక అలుకుతున్నారు. అదే విధంగా మరి కొన్ని గ్రామాల్లో రైతులు మొదటి దఫా వర్షాలు కురవడంతో పత్తి విత్తనాలు పెట్టడానికి చెలకల్లో దుక్కులు దున్ని సాగుబాటు చేసుకున్నారు. రెండు రోజులు కురిసిన వర్షాలతో ఆయా గ్రామాల్లోని రైతులు తమతమ పత్తి చేన్లలో కూలీలతో పత్తి విత్తనాలు వేస్తూ బిజీబిజీగా గడుపుతున్నారు. జిల్లాలోనే కాకుండా ఈ సీజన్‌లో ఇంతవరకు భారీ వర్షం కురవడకపోవడంతో అన్నదాతలు సాగు పనులు ప్రారంభించేందుకు ఆలోచిస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement