కొనసాగుతున్న విగ్రహాల తొలగింపు | - | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న విగ్రహాల తొలగింపు

Jun 22 2026 1:12 AM | Updated on Jun 22 2026 1:12 AM

కాళేశ్వరం: మహదేవపూర్‌ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలోని దక్షిణం, పడమర, ఉత్తరం వైపు వరకు ఉన్న ప్రాకార దేవతామూర్తుల విగ్రహాలను తమిళ శిల్పులు తొలిగిస్తున్నారు. గురువారం మొదలైన తొలగింపు ఆదివారం కొనసాగింది. ఉప ఆలయాల్లోని ఎలక్ట్రికల్‌ కనెక్షన్లు తీస్తున్నారు. ఆలయాల్లో పలు ఆభరణాలు, సామగ్రిని తీసి జాగ్రత్తగా భద్రపరిచారు. తొలగించిన సుమారుగా 50కిపైగా విగ్రహాలను శ్రీరాజరాజేశ్వరస్వామి వసతి గృహంలో భద్రపరచడానికి ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో విగ్రహాలు భద్రపరచడానికి కింద వరిధాన్యం పోసినట్లు తెలిసింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement