సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించాలి | - | Sakshi
Sakshi News home page

సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించాలి

Dec 21 2025 12:41 PM | Updated on Dec 21 2025 12:41 PM

సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించాలి

సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించాలి

డీఈఓ సిద్ధార్థ్‌రెడ్డి

ములుగు రూరల్‌: విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించాలని జిల్లా విద్యాశాఖ అధికారి సిద్ధార్థ్‌రెడ్డి సూచించారు. ఈ మేరకు బండారుపల్లి మోడల్‌ పాఠశాలలో రెండు రోజుల పాటు నిర్వహించిన వైజ్ఞానికి ప్రదర్శనలో 278 ప్రాజెక్టులను ప్రదర్శించగా డీఈఓ శనివారం పరిశీలించారు. అత్యుత్తమ ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు తెలిపారు. విద్యార్థులు 5 ఆర్‌రెడ్యూస్‌, రీయూస్‌, రీసైకిల్‌, రీకనుక్ట్‌, రెన్యూవబుల్‌ సూత్రాలను పాటిస్తూ ముందుతరాలకు వనరుల కొరత లేకుండా చూడాలని సూచించారు. రాష్ట్ర స్థాయికి 21 ప్రాజెక్టులు ఎంపికయ్యాయని వివరించారు. జనవరి 7వ తేదీన కామారెడ్డి జిల్లాలో నిర్వహించబోయే రాష్ట్రస్థాయి పోటీలలో ఆయా ప్రాజెక్టులను విద్యార్థులు ప్రదర్శించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement