‘టెన్త్’ టైం టేబుల్ మార్చాలి
● టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు సమ్మయ్య
ఏటూరునాగారం: టెన్త్ వార్షిక పరీక్షల టైం టేబుల్ అశాసీ్త్రయంగా ఉందని దానిని వెంటనే మార్చాలని టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు పొడెం సమ్మయ్య అన్నారు. మండల కేంద్రంలోని జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాల ఆవరణలో యూటీఎఫ్ మండల కమిటీ ఎన్నికను శనివారం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఏడు పరీక్షలకు 35రోజుల సమయం నిర్ణయించడం అనాలోచితమన్నారు. పరీక్ష పరీక్షకు నాలుగు నుంచి ఆరు రోజులు విరామం ఇవ్వడం వల్ల విద్యార్థుల ఆసక్తి తగ్గి అనవసర ఒత్తిడి పెరుగుతుందని తెలిపారు. ఒక పరీక్షకు ఒక్కరోజు విరామం చాలు అనేది విద్యావేత్తల అభిప్రాయం అన్నారు. ప్రభుత్వం పునరాలోచించి టైం టేబుల్ సవరించాలని కోరారు. అలాగే సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం నూతన మండల కమిటీ ఎన్నుకున్నారు .ఏటూరునాగారం మండల అధ్యక్షుడిగా పత్రి కిరణ్, ప్రధాన కార్యదర్శిగా పోడెం ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా మడే చిట్టిబాబు, ఎట్టి స్వరూప, కోశాధికారిగా మండప సంతోష్, కార్యదర్శులుగా సీహెచ్.సుమన్, ఎం.శ్రావణ్ కుమార్, ఎన్.వంశీ, ప్రశాంత్, ఎన్.రజిని, బి.రూప, వి.జగన్, ఎండీ.మున్వర్, పి.సరిత, ఎన్.రామచందర్‌రావును ఎన్నుకున్నారు.


