చెక్‌ డ్యాం పరిశీలన | - | Sakshi
Sakshi News home page

చెక్‌ డ్యాం పరిశీలన

Dec 21 2025 12:41 PM | Updated on Dec 21 2025 12:41 PM

చెక్‌ డ్యాం పరిశీలన

చెక్‌ డ్యాం పరిశీలన

మల్హర్‌: జిల్లా సరిహద్దులోని వల్లెకుంట–పెద్దపల్లి జిల్లా మంథని అడవి సోమన్‌పల్లి మానేరుపై నిర్మించిన డ్యామేజ్‌ అయిన చెక్‌డ్యాంను స్టేట్‌ ఫొరెన్సిక్‌ టీమ్‌, క్లూస్‌ టీం సభ్యులు శనివారం పరిశీలించారు. ఈనెల 17న చెక్‌ డ్యాం ధ్వంసమైన విషయం తెలిసిందే. ఈ మేరకు ఇరిగేషన్‌ అధికారులు కొయ్యూరు స్టేషన్‌లో ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు. శుక్రవారం పోలీసులు డాగ్‌ స్క్వాడ్‌తో తనిఖీలు చేపట్టగా శనివారం ఈ ఘటనపై చెక్‌ డ్యామ్‌ డ్యామేజీ అయిన ప్రదేశాన్ని ఫొరెన్సిక్‌, క్లూస్‌ టీం సభ్యులు చేరుకొని క్షుణ్ణంగా పరిశీలించి నమూనాలు సేకరించారు. సదరు నివేదిక ఆధారంగా చెక్‌ డ్యామ్‌ కూలిపోయిందా.. కూల్చేశారో తెలియనుంది. ఈ కార్యక్రమంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, కొయ్యూరు ఎస్సై నరేశ్‌, ఎస్సై–2 రజన్‌కుమార్‌, మహదేవపూర్‌ ఎస్సై పవన్‌ ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement