
కేసీఆర్ పాలనను కోరుకుంటున్న ప్రజలు
మంగపేట: తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌బాబు అన్నారు. మండల పర్యటనలో భాగంగా బుధవారం బ్రాహ్మణపల్లి కిందిగుంపునకు వచ్చిన ఆయనకు బీఆర్‌ఎస్ యూత్ జిల్లా ప్రధాన కార్యదర్శి బాడిశ నాగరమేష్, జిల్లా నాయకురాలు కొమరం ధనలక్ష్మి ఆధ్వర్యంలో కార్యకర్తలు, అభిమానులు డోలివాయిద్యాలతో మహిళలు బతుకమ్మలతో ఆయనకు ఘనస్వాగతం పలికారు. బొడ్రాయి వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయనతో కలిసి బతుకమ్మ ఆడారు. అనంతరం దోమెడ, రామచంద్రునిపేట, మల్లూరు, శనిగకుంటలో పార్టీ శ్రేణులతో కలిసి ఆయన పర్యటించారు. బ్రాహ్మణపల్లి కింది గుంపులోని నాగులమ్మ ఆలయం, దోమెడలోని ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ధికి తనవంతు సాయం అందిస్తానని హామీ ఇచ్చారు. అనంతరం రామచంద్రునిపేటలో ఇటీవల మృతి చెందిన పోటూరు శ్రీకాంత్ కుటుంబ సభ్యులను పరామర్శించి రూ. 5వేల నగదును అందజేశారు.
బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు
కాకులమర్రి లక్ష్మణ్‌బాబు