
అధికారులు పర్యవేక్షించాలి..
రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షానికి చెరువులు, కుంటలు నిండి మత్తడి పోయడం సంతోషంగా ఉంది. చెరువుల శిఖం భూములను కబ్జా చేసి పంటలను సాగు చేస్తున్న కొందరు ఇప్పటికే నాట్లు వేయగా మరి కొందరు సాగు చేసేందుకు సిద్దం చేసిన భూములు నీట మునిగి ఉన్నాయి. దీంతో ప్రతిఏటా కబ్జాదారులు చెరువుల షట్టర్లను ద్వంసం చేసి చెరువుల్లోని నీటిని బయటకు వెల్లగొడుతున్నారు. ఇరిగేషన్ అధికారులు చెరువులు. కుంటలు, ప్రాజెక్టులలో నీరు వృదాగా పోకుండా ఆయకట్టు రైతులకు ఉపయోగ పడే విదంగా పర్య వేక్షించాలి.
– నూతులకంటి కృష్ణ, బోరునర్సాపురం, రైతు