
నీరు వృథా కాకుండా చర్యలు
ప్రాజెక్టులు, చెరువులు, కుంటల్లోకి చేరిన నీటిని ఆయకట్టు రైంతాంగానికి పూర్తి స్థాయిలో సాగు నీరు అందేవిధంగా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిత్యం ప్రాజెక్టులు, చెరువులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నాం. ఎప్పటికప్పుడు అవసరమైన మేరకు నీరు వృథాగా పోకుండా ఉండేందుకు మరమ్మతులు చేస్తున్నాం. తమ అనుమతి లేకుండా ఎవరైనా తూముల షట్టర్లు తెరిచినా, ద్వంసం చేసినా వారిపై కేసులు పెట్టి చట్టపరంగా చర్యలు తీసుకుంటాం.
– వలీం మహ్మద్, ఇరిగేషన్ ఏఈఈ, మంగపేట