
విద్యార్థుల భవిష్యత్‌కు పునాదులు వేయాలి
ములుగు రూరల్: గురుకుల పాఠశాలలు, వసతి గృహాల్లో విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల భవిష్యత్‌కు ఉపాధ్యాయులు పునాదులు వేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, సీ్త్ర–శిశు సంక్షేమశాఖ మంత్రి సీతక్క అన్నారు. ఈ మేరకు శుక్రవారం కలెక్టరేట్‌లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ హాస్టళ్లు, సంక్షేమ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశానికి ఆమె మాట్లాడారు. వసతి గృహాల్లో విద్యార్థులకు మౌలిక వసతులు, విద్య, నాణ్యమైన భోజనం అందించాలన్నారు. హాస్టల్ విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి పై ఆర్‌బీఎస్‌కే బృందాలు సందర్శించి పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. పరిశుభ్రత పాటించాలని తెలిపారు. విద్యార్థుల తల్లిందండ్రులతో సమావేశాలు నిర్వహించాలని చెప్పారు.
కష్టసుఖాల్లో తోడుగా ఉంటా..
వెంకటాపురం(ఎం): ప్రజల కష్టసుఖాల్లో పాలుపంచుకుంటానని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క అన్నారు. శుక్రవారం మండలంలోని జవహర్‌నగర్, లక్ష్మీదేవిపేట, అడవిరంగాపూర్ గ్రామాల్లో ఆమె పర్యటించారు. జవహర్‌నగర్ గ్రామంలోని ఎస్సీ కాలనీలో రూ.కోటి 25లక్షలతో ఏర్పాటు చేసిన అంతర్గత సీసీ రోడ్లు, డ్రెయినేజీలను ప్రారంభించారు. లక్ష్మీదేవిపేటలో రేషన్‌కార్డులు పంపిణీ, పాఠశాలలో రూ.5లక్షలతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్‌ను ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. బుర్గుపేట పరిధిలోని మారెడుగొండ చెరువు నుంచి నీటిని విడుదల చేశారు. అడవిరంగాపూర్ గ్రామంలో రూ.3.5 కోట్లతో నిర్మించనున్న 33/11 విద్యుత్ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు.
ఆయిల్‌పామ్ సాగుతో అధిక ఆదాయం..
గోవిందరావుపేట: తక్కువ పెట్టుబడితో ఎక్కువ ఆదాయం పొందే పంట ఆయిల్ పామ్ అని రాష్ట్ర మంత్రి సీతక్క అన్నారు. మండలంలోని చల్వాయిలో ఆయిల్‌పామ్ పంట సాగు చేస్తున్న రైతులకు చెక్కులు పంపిణీ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడారు. జంగాలపల్లి సమీపంలో పామాయిల్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. మండలంలో 70 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు హర్షించదగ్గ విషయమని, ఐదు ఎకరాల్లో సాగు చేసిన రైతు బండమీది కుమారస్వామిని అభినందించారు. కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ.. ఈ సంవత్సరం కొత్తగా 246 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగు చేసినట్లు తెలిపారు. అనంతరం కలెక్టర్‌తో కలిసి మంత్రి సీత క్క మొక్కలు నాటారు. లబ్ధిదారులకు రేషన్ కార్డు మంజూరు పత్రాలను సీతక్క అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో కలెక్టర్ దివాకర టీఎస్, అదనపు కలెక్టర్ మహేందర్‌జీ, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగ కల్యాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రవిచందర్, డీసీఎస్‌ఓ షాఫైజల్ హుస్సేన్, డీఎం రాంపతి, ఎస్‌ఈ మన్సూర్ నాయక్, డీఈ నాగేశ్వర్‌రావు, ఇరిగేషన్ ఈఈ జగదీశ్వర్, తహసీల్దార్ గిరిబాబు, ఎంపీడీఓ రాజు, నాయకులు పాల్గొన్నారు.
సమీక్ష సమావేశంలో మంత్రి సీతక్క