
వైభవంగా సీతారాముల కల్యాణం
వెంకటాపురం(కె): మండల కేంద్రంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో గురువారం దమ్మక్క ఉత్సవాల సందర్భంగా భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం ఆధ్వర్యంలో సీతారాముల కల్యాణ మహోత్సవం వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణ మహోత్సవ తంతును వేద పండితుల మంత్రోచ్ఛరణలు, భక్తుల రామనామస్మరణల నడువ నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేంకటేశ్వరస్వామి కార్యనిర్వహణ అధికారి సత్యనారాయణ, జూనియర్ అసిస్టెంట్ అజయ్, భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానం నుంచి శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ పాల్గొన్నారు.
పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసుకోవాలి
వెంకటాపురం(కె): మండలంలోని ఇసుక ర్యాంపులకు వచ్చే ఇసుక లారీలకు ఇసుక సొసైటీలు పార్కింగ్ స్థలాలు ఏర్పాటు చేసుకోవాలని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల పరిధిలోని యాకన్నగూడెం బ్రిడ్జి వద్ద ఇసుక లారీలతో గురువారం ట్రాఫిక్ జామ్ అయ్యిందని తెలిపారు. సమాచారం తెలుసుకున్న వెంకటాపురం ఎస్సై కొప్పుల తిరుపతిరావు సంఘటనా స్థలానికి చేరుకుని క్లియర్ చేశారని తెలిపారు. ఇసుక క్వారీ నిర్వహకులు, సొసైటీ సభ్యులు పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలం ఏర్పాటు చేసుకోవాలని, రోడ్ల పై వాహనాలు నిలిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
30 లారీలకు జరిమానా
వాజేడు: నిబంధనలకు విరుద్ధంగా జాతీయ రహదారిపై నిలిపిన 30 ఇసుక లారీల యజమానులకు జరిమానా విధించినట్లు పేరూరు ఎస్సై కృష్ణప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఆదేశాల మేరకు ధర్మారం నుంచి చెరుకూరు వరకు రహదారిపై రాంగ్ పార్కింగ్‌లో నిలిపిన లారీలకు జరిమానా విధించినట్లు వెల్లడించారు. ఇసుక క్వారీ నిర్వహకులు లారీలను నిలపడానికి పార్కింగ్ స్థలాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
17న గుండె ఆపరేషన్లు
ములుగు రూరల్: జిల్లాలోని రాష్ట్రీయ బాలల సస్త్య కార్యక్రమంలో గుర్తించిన పది మంది పిల్లలకు ఈ నెల 17న సిద్ధిపేటలో గుండె ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి గోపాల్‌రావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన గురువారం మాట్లాడుతూ పది మంది పిల్లలకు సాయి సంజీవని ట్రస్ట్ సిద్ధిపేట వారి ఆధ్వర్యంలో ఉచిత ఆపరేషన్ తో పాటు ఉచిత రవాణా, వసతి, భోజన సౌకర్యం కల్పిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సాయిసంజీవని ట్రస్టు వాలంటీర్లు దామోదర్, ఆర్బీఎస్కే ప్రోగ్రాం కోఆర్డినేటర్ నరహరి, శ్రీనివాస్, మల్లిఖార్జున్ తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలి
వెంకటాపురం(కె): ఏజెన్సీలో విచ్చలవిడిగా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని గోండ్వానా సంక్షేమ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి అన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ డీఈఓ సత్యనారాయణకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రయివేటు పాఠశాలలు అధిక ఫీజలు వసూలు చేస్తున్నాయని, అనుమతులు లేని పాఠశాలలపై చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని విద్యా సంస్థల్లో క్రీడా మైదానాలు కూడా లేకపోవడంతో పాటు మౌలిక వసతులు లేవని వివరించారు.

వైభవంగా సీతారాముల కల్యాణం

వైభవంగా సీతారాముల కల్యాణం