
గొత్తికోయలు గొడవలు పెట్టుకోవద్దు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: తాడ్వాయి– పస్రా మార్గ మధ్యలోని తోగు గొత్తికోయగూడెంలో అందరూ కలిసి మెలిసి ఉండాలని తగాదాలు పెట్టుకోవద్దని, ఏమైనా సమస్యలు ఉంటే పోలీసులను సంప్రదించి పరిష్కరించుకోవాలని డీఎస్పీ రవీందర్ సూచించారు. ఈ మేరకు మంగళవారం ఆయన గొత్తికోయగూడెంలోని సమస్యల గురించి గిరిజనులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవీందర్ గొత్తికోయలతో మాట్లాడారు. ఆయన వెంట పస్రా సీఐ రవీందర్, తాడ్వాయి ఎస్సై శ్రీకాంత్‌రెడ్డిలు ఉన్నారు, అనంతరం ఎస్సై శ్రీకాంత్‌రెడ్డి కాటాపూర్ క్రాస్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహించారు. వాహనాల పెండింగ్ చలాన్లను కట్టించారు.