వనదేవతలను దర్శించుకున్న అధికారులు
ఎస్‌ఎస్ తాడ్వాయి: మేడారం సమ్మక్క–సారలమ్మలను నిజామాబాద్ సెంట్రల్ జైలు ఎస్పీ కూన ఆనందరావు, రాష్ట్ర సెక్రెటియేట్ చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ పుట్ట దేవిదాస్‌లు కుటుంబ సమేతంగా సోమవారం దర్శించుకున్నారు. వనదేవతలకు ఎత్తు బంగారం సమర్పించారు. గోవిందరాజు, పగిడిద్దరాజులను దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం సమ్మక్క పూజారి సిద్ధబోయిన స్వామి, రమేష్‌లు డోలు వాయిద్యాలతో వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారిని అమ్మవార్ల పట్టువస్త్రాలతో సన్మానించి ప్రసాదం అందజేశారు. వారి వెంట నాయకపోడు సంఘం రాష్ట్ర నాయకుడు కూన శివరాం, ఎస్‌ఎస్ తాడ్వాయి మండల అధ్యక్షుడు గుండ్ల రాజు, మండల యూత్ అధ్యక్షుడు కోడి సతీష్ పాల్గొన్నారు.


