తల్లుల దర్శనానికి భక్తుల తంటాలు
ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శనానికి క్యూలైన్‌లో వేచి ఉండే భక్తులకు ఇబ్బందులు తప్పడం లేదు. తల్లుల దర్శనానికి ఎండా, వానా ఎదుర్కోవాల్సి వస్తోంది. ఒక్క జాతర సమయంలో క్యూలైన్లపై తాత్కాలికంగా తడకలు ఏర్పాటు చేస్తారు. ఆతర్వాత వాటిని తొలగిస్తారు. దీంతో భక్తులు ఏడాది పొడవునా ఎండకు ఎండుతూ.. వానకు నానుతూ అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. మేడారంలోని క్యూలైన్లపై జీఐ షీట్ల పనులు ఇంకా ప్రారంభం కాలేదు. సమ్మక్క–సారలమ్మను దర్శించుకునేందుకు క్యూలైన్లలో వచ్చే భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లపై శాశ్వతంగా జీఐ షీట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మినీ జాతరకు ముందు రూ.3 కోట్ల నిధులు మంజూరు చేసింది. ఈపనుల టెండర్లు కూడా పూర్తయ్యాయి. మినీ మేడారం జాతర ముగిసినప్పటికీ పనులు కార్యరూపం దాల్చలేదు.
హడావుడి పనులేనా?
2026 ఫిబ్రవరిలో జరిగే మేడారం మహాజాతరకు ఈసారి ముందుగానే పనులన్నీ పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రి సీతక్క దృష్టి సారించారు. ఇప్పటికే మేడారంలో రూ.12 కోట్లతో రోడ్ల నిర్మాణ పనులు పూర్తయాయి. క్యూలైన్లపై జీఐ షీట్ల పనుల్ని కూడా మహా జాతరకు ముందుగానే పూర్తి చేయాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం రూ.3 కోట్ల నిధులు కేటాయించింది. ఇప్పటి వరకు పనులు ప్రారంభం కాకపోవడంతో తీరా జాతర సమయం సమీపించాక హడావిడిగా పనులేనా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. నిధులు మంజూరై టెండర్లు పూర్తయి పనులు మాత్రం ప్రారంభించకపోవడంతో అధికారుల పనితీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మొదలు కాని పనులు..
డిజైన్ రాగానే
పనులు మొదలు
పనులు త్వరగా చేపట్టాలి..
బారులు.. బాధలు!
బారులు.. బాధలు!