పదో తరగతి పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేశాం. అధికారులు విధుల పట్ల నిర్లక్ష్యం వహించకూడదని హెచ్చరించాం. ఈ విద్యా సంవత్సరం నుంచి 24పేజీల ఆన్సర్ బుక్‌లెట్ అందిచనున్నాం. ప్రశ్నపత్రంపై క్యూర్ కోడ్ ఉంటుంది. ఫ్రీఫైనల్ పరీక్షల్లో రెండు పేపర్లకు ఓఎంఆర్ షీట్లు అందించి విద్యార్థులకు అవగాహన కల్పించాం. అన్ని శాఖల అధికారులతో సమన్వయంగా ఉంటూ ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా చూస్తాం. విద్యార్థులు ఒక గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి.
– పాణిని, డీఈఓ