గోవిందరావుపేట: విద్యుత్ అధికారులు గురువారం పొలంబాట కార్యక్రమం నిర్వహించారు. మండల పరిధిలోని రంగాపూర్ ఎస్‌ఎస్–4కేవీఏ ట్రాన్స్‌ఫార్మర్ పరిధిలో విద్యుత్‌శాఖ డీఈ టెక్నికల్ వెంకటేశ్వర్లతో పాటు విద్యుత్ అధికారులు పర్యటించారు. విద్యుత్ సరఫరా గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ వ్యవసాయ పంపుసెట్లను వినియోగించినప్పుడు విద్యుత్ మోటార్ల వాల్వులు సర్వీస్ ఇన్సులేషన్ సరిగా లేకపోవటంతో విద్యుత్ ప్రసారమై ఏమరుపాటులో వాటిని తాకితే ప్రమాదాల బారిన పడుతారని తెలిపారు. రైతులు డీఎస్‌ఎం పద్ధతులను పాటించి నాణ్యమైన విద్యుత్ సరఫరా పొందాలన్నారు. ఐఎస్‌ఐ మార్కుగల మోనో బ్లాక్ పంపు సెట్లను, సబ్ మెర్సిబుల్ పంపు సెట్లను వాడాలని, తగిన కెపాసిటర్లను బిగించుకోవాలి కోరారు. ఈ కార్యక్రమంలో ఏఈ దేవ్‌సింగ్, ఇన్‌స్పెక్టర్ సమ్మిరెడ్డి, లైన్‌మెన్ ఎం.వేణు, రంజిత్, నవీన్, రైతులు, తదితరులు పాల్గొన్నారు.