హైకోర్టును ఆశ్రయించిన హరిబాబు? | - | Sakshi
Sakshi News home page

హైకోర్టును ఆశ్రయించిన హరిబాబు?

Mar 7 2025 9:34 AM | Updated on Mar 7 2025 9:34 AM

భూపాలపల్లి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భూపాలపల్లి పట్టణానికి చెందిన నాగవెల్లి రాజలింగమూర్తి హత్య కేసులో నిందితుడిగా ఉన్న కొత్త హరిబాబు ముందస్తు బెయిల్‌ కోసం హైకోర్టును ఆశ్రయించినట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే.. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ కోర్టుకు వెళ్లిన భూపాలపల్లి పట్టణానికి చెందిన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి గత నెల(ఫిబ్రవరి) 19న రాత్రి తన ఇంటికి వెళ్తున్న క్రమంలో దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. పోలీసులు ఫిబ్రవరి 23న ఏడుగురు నిందితులను అరెస్ట్‌ చూపించారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ నెల 1వ తేదీన ఏ9గా ఉన్న పుల్ల నరేష్‌ను సైతం అదుపులోకి తీసుకొని అరెస్ట్‌ చూపించారు. ఏ8గా ఉన్న భూపాలపల్లి మున్సిపాలిటీ మాజీ వైస్‌చైర్మెన్‌, బీఆర్‌ఎస్‌ నాయకుడు కొత్త హరిబాబు, ఏ10గా ఉన్న పుల్ల సురేష్‌ కోసం పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న హరిబాబు ఇటీవల హైకోర్టును ఆశ్రయించి, ముందస్తు బెయిల్‌ కోసం అప్పీల్‌ చేసుకున్నట్లు సమాచారం. అయితే బెయిల్‌ పిటిషన్‌పై ఈ నెల 10న వాదనలు జరుగనున్నట్లు తెలిసింది.

ముందస్తు బెయిల్‌ కోసం పిటిషన్‌ దాఖలు

రాజలింగమూర్తి హత్య కేసులో ఏ8గా అతడిపై కేసు నమోదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement