
సీపీఆర్ చేసి చూపిస్తున్న తహసీల్దార్ శ్రీనివాస్
ఎస్‌ఎస్‌తాడ్వాయి: ీసీపీఆర్‌పై ప్రతిఒక్కరూ తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలని డీఎంహెచ్‌ఓ, మండల స్పెషలాఫీసర్ అల్లెం అప్పయ్య అన్నారు. మండల కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లకు, పంచాయతీ కార్యదర్శులకు, ట్రాన్స్‌కో అధికారులకు సీపీఆర్‌పై శుక్రవారం అవగాహన కల్పించారు. సీపీఆర్ చేసే విధానంలో మెళకువలను వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎంహెచ్‌ఓ హాజరై మాట్లాడారు. పెరిగిన పని ఒత్తిడితో ప్రజలు ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని తెలిపారు. వీటివల్ల గుండెపోటు వచ్చే ప్రమాదం ఉందన్నారు. సడన్‌గా కార్డియాక్ అరెస్ట్ అయిన సమయంలో వ్యక్తిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించేలోపు ఏమైనా జరిగే ప్రమాదం ఉందని, అటువంటి వారికి సత్వరమే ప్రాథమిక చికిత్స అందించాలంటే సీపీఆర్‌పై అవగాహన ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన సీపీఆర్‌పై అవగాహన ప్రతీఒక్కరికి ఉపయోగపడుతుందని వివరించారు. కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాస్, ఎంపీడీఓ సత్యాంజనేయప్రసాద్, వైద్యాధికారి రణధీర్ పాల్గొన్నారు.