
ములుగు: సెల్ఫ్ షఫీసియంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గ్రామ పంచాయతీ విభాగంలో రాష్ట్ర స్థాయికి ఎంపిక అయిన మల్లంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ చందా కుమారస్వామి, పంచాయతీ కార్యదర్శి పోలు రాజు శుక్రవారం రాష్ట్రస్థాయి ఉత్తమ అవార్డును అందుకున్నారు. హైదరాబా ద్‌లోని రాజేంద్రగనర్‌లోని ఆడిటోరియంలో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, మల్లారెడ్డి చేతుల మీదుగా ఉత్తమ అవార్డును తీసుకున్నారు. ఈ మేరకు సర్పంచ్, కార్యదర్శిని మంత్రులు శాలువాలతో సన్మానించారు.
పౌష్టికాహారం అందించాలి
ములుగు రూరల్: కిశోర బాలికలకు పౌష్టికాహారం తప్పనిసరి అందించాలని ములుగు సెక్టార్ సూపర్‌వైజర్ భాగ్యలక్ష్మీ సూచించారు. మండల పరిధిలోని దేవగిరిపట్నం జెడ్పీ హెచ్‌ఎస్, సీఏపీఎస్ పాఠశాలలో పోషణ్ పక్వాడా కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గర్భిణులు, బాలింతలు పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోవాలన్నారు. అనంతరం చిరు ధాన్యాలపై పాఠశాల విద్యార్థులకు వ్యాస రచన పోటీలు నిర్వహించారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీధర్, వేణుమాధవ్, లక్ష్మీ ప్రసన్న, అపర్ణ, అంగన్‌వాడీ టీచర్లు కవిత, విజయలక్ష్మీ, కవిత తదితరులు పాల్గొన్నారు.
డీలర్లకు శిక్షణ తరగతులు
ములుగు రూరల్: జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన ఫర్టిలైజర్ డీలర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. జిల్లాకేంద్రంలోని రైతు వేదికలో జిల్లా వ్యవసాయ అధికారి గౌస్‌హైదర్ శుక్రవారం ప్రారంభించి మాట్లాడారు. డిప్లమా ఇన్ అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ సర్విస్ ఫర్ ఇన్‌పుట్ డీలర్స్ ఆధ్వర్యంలో శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. డీలర్లకు 40 వారాల పాటు తరగతులు నిర్వహిస్తామన్నారు. రైతులకు పురుగు మందల వాడకం, విత్తనాల ఎంపికపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి మునుకుంట్ల సంతోష్, సిబ్బంది పాల్గొన్నారు.
బార్ అసోసియేషన్
అధ్యక్షుడిగా వేణుగోపాలచారి
ములుగు: ములుగు బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా చక్రవర్తుల వేణుగోపాలచారి ఎన్నికయ్యారు. స్థానిక జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ హాల్‌లో శుక్రవారం బార్ అసోసియేషన్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రధాన కార్యదర్శిగా మేకల మహేందర్, కోశాధికారిగా బానోతు స్వామిదాస్‌ను ఎన్నుకున్నట్లు ఎలక్షన్ అధికారి వెంకటేశ్వరరావు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు నర్సిరెడ్డి, వినయ్‌కుమార్, చంద్రయ్య, భిక్షపతి, శ్యామ్ ప్రసాద్, సునీల్‌కుమార్ పాల్గొన్నారు.
దరఖాస్తుల స్వీకరణ
భూపాలపల్లి అర్బన్: జిల్లాలో ఆర్థిక పునరావాసం పథకం కింద ఉపాధి పొందేందుకు అర్హులైన ట్రాన్స్ జెండర్ల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జ్ సంక్షేమ అధికారిణి టి.శైలజ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రూ.50వేల విలువ గల రెండు యూనిట్‌లను జిల్లాకు కేటాయించినట్లు చెప్పారు. ట్రాన్స్‌జెండర్ సర్టిఫికెట్, ఐడెంటిటీ కార్డు కలిగిన అర్హులైన వారు ఈ నెల 10వ తేదీలోపు జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

