సెప్టెంబర్ 9న విజయ్ సేతుపతి, శ్రుతి హాసన్‌ల ‘లాభం’

Vijay Sethupathi, Shruti Haasan Laabam Movie To Release On September 9th - Sakshi

విజయ్ సేతుపతి, శ్రుతి హాసన్ హీరో, హీరోయిన్లుగా తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించిన చిత్రం ‘లాభం’. ఎస్పీ జననాథన్‌ దర్శకత్వ వహించిన ఈ చిత్రంలో ఇందులో జగపతిబాబు, సాయి ధన్సిక ప్రధాన పాత్రలు పోషించారు. శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ పతాకంపై నిర్మాత బత్తుల సత్యనారాయణ(వైజాగ్ సతీష్) ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.  ఈ చిత్రానికి లాయర్ శ్రీరామ్ సమర్పణ. హరీష్ బాబు ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం వినాయకచవితి సందర్భంగా సెప్టెంబర్ 9న విడుదల అవుతోంది.
(చదవండి: ‘శ్రీదేవీ సోడా సెంటర్’పై మహేశ్‌ బాబు రివ్యూ)

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ... 'విజయ్ సేతుపతి, శ్రుతిహాసన్ జంటగా నటించిన "లాభం" చిత్రం  సెప్టెంబర్ 9న తెలుగు, తమిళంలో ఏకకాలంలో విడుదల అవుతోంది. ఇలా రెండు భాషల్లో మొదటిసారి విజయ్ సేతుపతి చిత్రం విడుదలకావడం విశేషం. మాస్టర్, ఉప్పెన తరువాత విజయ్ సేతుపతి నటించిన పక్కా కమర్షియల్ చిత్రం ఇది. తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుంది. విజయ్ సేతుపతి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది ' అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top