‘శ్రీదేవీ’ అదిరింది.. సుధీర్‌ బెస్ట్ ఫెర్మార్మెన్స్‌ ఇదే : మహేశ్‌ బాబు

Mahesh Babu Showers Praise on Sudheer Babu’s Sridevi Soda Center - Sakshi

సుధీర్‌ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్‌. ‘పలాస 1978’ ఫేమ్‌ కరుణ కుమార్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తెలుగమ్మాయి ఆనంది హీరోయిన్‌గా నటించింది. ఎన్నో అంచనాల మధ్య శుక్రవారం (ఆగస్ట్‌ 27) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది. రొటీన కథ అని కొందరంటే, సినిమా అదిరిపోయిందని మరికొంత మంది అంటున్నారు. ఇక ఈ మూవీపై తనదైన శైలీలో రివ్యూ ఇచ్చాడు సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు. శుక్రవారం తన ఇంట్లోని మినీ థియేటర్లలో సినిమాను వీక్షించిన మహేశ్‌.. దర్శకుడు కరుణ కుమార్‌, హీరో సుధీర్‌ బాబుపై ప్రశంసల జల్లుకురిపించాడు.
(చదవండి: శ్రీదేవి సోడా సెంటర్‌ రివ్యూ)

‘శ్రీదేవీ సోడా సెంటర్ రా అండ్ ఇంటెన్స్ మూవీ.. అంతేకాకుండా అదిరిపోయే క్లైమాక్స్ కూడా ఉంది. ‘పలాస’ తరువాత దర్శకుడు కరుణ కుమార్ అద్భుతమైన బోల్డ్ మూవీతో మన ముందుకు వచ్చాడు. సుధీర్ బాబు అద్భుతంగా నటించాడు. ఇప్పటి వరకు చేసిన దాంట్లో ఇదే తన బెస్ట్ ఫెర్మార్మెన్స్‌. నరేష్ గారు ఎప్పటిలానే అవలీలగా,అద్భుతంగా చేసి అలరించారు. హీరోయిన్ ఆనంది గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాలి. టీమ్‌ అందరికి మరోసారి శుభాకాంక్షలు’అని మహేశ్‌ వరుస ట్వీట్లు చేశాడు.

whatsapp channel

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top