
ఇందులో విజయ్.. రష్మికను పట్టుకుని ఉండగా.. ఆమె మాత్రం సిగ్గుతో తల దించుకున్నట్లుగా ఉంది. ఇది చూసిన కొందరు ఇంత సడన్‌గా పెళ్లి చేసుకున్నారా? అని ఆశ్చర్యపోతుంటే
ఒకటీరెండుసార్లు కాదు, ఎన్నోసార్లు విజయ్ దేవరకొండ- రష్మిక మందన్నాల మధ్య ఏదో ఉందంటూ పుకార్లు పుట్టుకొచ్చాయి. దీని గురించి మీ స్పందనేంటని అడిగినప్పుడల్లా మేమిద్దరం మంచి మిత్రులం మాత్రమేనని ఆన్సరిచ్చారిద్దరూ. అయితే ఇటీవలే వీరు మాల్దీవులు ట్రిప్‌కు వెళ్లిచ్చారు. దీంతో జనాలు ఈ సీక్రెట్ ప్రేమ వ్యవహారాన్ని ఎప్పుడు బయటపెడ్తారా? అని ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో విజయ్, రష్మికలు పూలదండలు మార్చుకున్న పెళ్లి ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో విజయ్.. రష్మికను పట్టుకుని ఉండగా.. ఆమె సిగ్గుతో తల దించుకున్నట్లుగా ఉంది.
ఇది చూసిన కొందరు ఇంత సడన్‌గా పెళ్లి చేసుకున్నారా? అని ఆశ్చర్యపోతుంటే మరికొందరు మాత్రం ఇదేదో ఫొటోషూట్ కావచ్చేమోనని అభిప్రాయపడుతున్నారు. అసలు నిజమేంటంటే.. అది పెళ్లీ కాదు, ఫొటో షూట్ కాదు.. ఇదొక మార్ఫింగ్ ఫొటో. విజయ్, రష్మిక పెళ్లి చేసుకుంటే వారి జంట ఎలా ఉంటుందో చూడాలనుకున్న అభిమానులు ఇలా ఫొటోషాప్ మహిమతో వారికి పెళ్లి జరిపించేశారు. ఇది చూసిన కొందరు అభిమానులు రియల్ లైఫ్‌లో కూడా వారి పెళ్లి జరిగితే బాగుండని కోరుకుంటున్నారు.
చదవండి: 51ఏళ్ల వయసులో తండ్రి కాబోతున్న నటుడు
అఫీషియల్.. ఓటీటీలో కాంతార