Unlucky Time For Top Actress Pooja Hegde - Sakshi
Sakshi News home page

Pooja Hegde: పూజా హెగ్డేకు బ్యాడ్‌టైం

Dec 15 2022 7:17 AM | Updated on Dec 15 2022 8:49 AM

Unlucky time for top actress Pooja Hegde - Sakshi

ఏ రంగంలో అయినా సక్సెస్‌తోనే పేరు, అంతస్తులు వస్తాయని, ప్లాప్‌ వస్తే ఎవరు పట్టించుకోరు. పైగా ఐరన్‌ లెగ్‌ అంటూ ముద్ర వేసేస్తారు. ఇప్పుడు కోలీవుడ్‌లో నటి పూజా హెగ్డే పరిస్థితి ఇలానే ఉంది. ఈ బ్యూటీ మొదట కథానాయికిగా ఏంట్రీ ఇచ్చింది ఇక్కడే. ఫ్లాపులను మూటగట్టుకుంది ఇక్కడే.

ఆదిలో నటుడు జీవాకు జంటగా ముఖముడి చిత్రంలో పరిచయమైంది. మిష్కిన్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ప్లాప్‌ అయ్యింది. దీంతో ఈ అమ్మడుని కోలీవుడ్‌ దూరం పెట్టేసింది. దీంతో టాలీవుడ్‌పై దృష్టి సారించింది. అక్కడ నటించిన రెండు మూడు చిత్రాలు ఆశించిన విజయాన్ని సాధించకపోయినా, మహేష్‌ బాబు, అల్లు అర్జున్‌ వంటి స్టార్‌ హీరోలతో నటించే అవకాశాలను దక్కించుకుని సక్సెస్‌ను అందుకుంది.

చదవండి: (Actress Abhinaya: సినీ నటి అభినయకు రెండేళ్ల జైలు శిక్ష)

అంతేకాదు టాలీవుడ్‌లో టాప్‌ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తోంది. ఆ క్రేజే మళ్లీ పూజా హెగ్డేను కోలీవుడ్‌ పిలిపించింది. అలా ఈ మధ్య విజయ్‌తో బీస్ట్‌ చిత్రంలో చేసింది. ఇటీవల ఈ అమ్మడి టైం బాగున్నట్టు లేదు. కోలీవుడ్‌లో ఎన్నో ఆశలు పెట్టుకుని నటించిన బీస్ట్‌ చిత్రంతో పాటు టాలీవుడ్‌లో ప్రభాస్‌తో చేసిన రాధేశ్యామ్, చిరంజీవి, రామ్‌ చరణ్‌లతో కలిసి నటించిన ఆచార్య చిత్రాలు వరుసగా నిరాశపరిచాయి. ముఖ్యంగా కోలీవుడ్‌లో నటించిన రెండు చిత్రాలు ప్లాప్‌ కావడంతో పూజ హెగ్డేపై రాశిలేని నటి అనే ముద్ర పడిపోయింది.

దీంతో ఆ ముద్ర చెరిపేసుకోవాలనే  ప్రయత్నంలో భాగంగా తన పారితోషికాన్ని సైతం తగ్గించుకోవడానికి సిద్ధపడిందని, అలాగే గ్లామర్‌ పాత్రలు ఇక్కడ వర్కౌట్‌ కాకపోవడంతో నటనకు అవకాశం ఉన్న హీరోయిన్‌ సెంట్రిక్‌ కథా చిత్రాల్లో నటించడానికి ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయినా కోలీవుడ్‌లో పూజా హెగ్డేకు అవకాశాలు రావడం లేదు. అయితే తెలుగు, హిందీ చిత్రాలతో ఈ బ్యూటీ బిజీగానే ఉంది.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement