
టాలీవుడ్ బుల్లితెర ప్రేక్షకులను అలరించేందుకు బిగ్బాస్ వచ్చేస్తున్నాడు. ఈ ఆదివారం నుంచే బిగ్ రియాలిటీ షో ప్రారంభం కానుంది. ఇప్పటికే కంటెస్టెంట్స్ లిస్ట్ ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సీజన్ కోసం కామన్ కేటగిరి నుంచి అగ్ని పరీక్ష పేరుతో కంటెస్టెంట్స్‌ను ఎంపిక చేయనున్నారు. ఈ ప్రక్రియ ఇప్పటికే దాదాపు పూర్తయినట్లే తెలుస్తోంది. ఈ కేటగిరీలో ఐదు నుంచి ఆరుమందిని ఎంపిక చేస్తారని సమాచారం..
ఇక బిగ్బాస్పై రివ్యూలు చేస్తోన్న మాజీ కంటెస్టెంట్ ఆదిరెడ్డి ఈ సీజన్లో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవరన్నది రివీల్ చేశారు. ఇది అఫీషియల్ కాకపోయినా.. కాస్తా అటు.. ఇటు కూడా వీరిలో కొందరైనా ఉండొచ్చు. ఆదిరెడ్డి అనలైసిస్ ప్రకారం రీతూ చౌదరి, ఇమ్మానియేల్, రాము రాథోడ్, తనూజా గౌడ, ఆశా షైనీ, భరణి శంకర్, సుమన్ శెట్టి, శ్రష్టి వర్మ, సంజనా గార్లానీ లాంటి సెలబ్రీటీలు ఉండొచ్చని అంచనా వేశారు.
అలాగే కామన్ మ్యాన్ కేటగిరి నుంచి ఐదు నుంచి ఆరుగురిని సెలెక్ట్ చేస్తారని చెప్పుకొచ్చారు. వారిలో మాస్క్ మ్యాన్ హరీశ్, మర్యాద మనీశ్, శ్రీజ, ఆర్మీ పవన్ కల్యాణ్, ప్రియా, పవన్ పాల్గొనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఆదిరెడ్డి అంచనా వేశారు. ఈ లిస్ట్లో ఉన్నవారంతా బిగ్బాస్ హౌస్‌లో కనిపిస్తారా? లేదా అన్నది తెలియాలంటే ఏడో తేదీ వరకు ఆగాల్సిందే. కాగా.. సెప్టెంబర్ 7న బిగ్‌బాస్ సీజన్ 9 ప్రారంభం కాబోతుందని ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈసారి కూడా కింగ్ నాగార్జునే ఈ రియాలిటీ షోకి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు.