Tamil Hero Ajith Thegimpu Movie Superhit on Netflix - Sakshi
Sakshi News home page

నెట్‌ఫ్లిక్స్‌లో ట్రెండింగ్‌లో అజిత్‌కుమార్‌ 'తెగింపు' మూవీ

Feb 17 2023 9:00 PM | Updated on Feb 17 2023 9:00 PM

Tamil Hero Ajith Thegimpu Movie Super Hit in OTT - Sakshi

బాక్సాఫీస్ దగ్గర హిట్ కొట్టి, ఓటీటీలో కూడా దుమ్మురేపే సినిమాలు, చాలా అరుదుగా ఉంటాయి. ఎందుకంటే ఆల్రెడీ థియేటర్ లో వారాల తరబడి ఆడిన చిత్రాన్ని, ఓటీటీలోకి ఎంట్రీ ఇవ్వగానే పెద్దగా చూపించరు ఆడియెన్స్. ఈ మధ్య ఆర్‌ఆర్‌ఆర్‌ మాత్రమే, బాక్సాఫీస్ను మించి ఓటీటీలో ఆదరణ అందుకుంది. ఇప్పుడు అజిత్ నటించిన తెగింపు కూడా అంతే, నెట్ ఫ్లిక్స్ కు వ్యూస్ వర్షాన్ని కురిపిస్తోంది.

అజిత్ నటించిన తెగింపు ఎక్కడా, రాజమౌళి తెరకెక్కించిన ఆర్‌ఆర్‌ఆర్‌ ఎక్కడా, ఈ రెండు చిత్రాలకు పోలీక ఏంటి, ఏమైనా సంబంధం ఉందా అంటూ మండి పడిపోకుండి. నిజానికి మీరు అనుకున్నది నిజమే.  ఈ రెండిటికి ఎక్కడా లింక్ లేదు. బాక్సాఫీస్ దగ్గర ఆర్‌ఆర్‌ఆర్‌ 1100 కోట్లకు పైగా రాబడితే, తెగింపు వరల్డ్ వైడ్ గా 250 కోట్లు రాబట్టింది. అయితే ఓటీటీలో మాత్రం, ఆర్‌ఆర్‌ఆర్‌ ఏ విధంగా ట్రెండ్ అయిందో, అదే విధంగా ట్రెండ్ అవుతోంది.

ఇటీవలే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది తెగింపు మూవీ. తెలుగు,తమిళ, హిందీ భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌ సబ్ స్క్రైబర్స్‌కికు అందుబాటులో ఉంది. దాంతో ఈ సినిమాను తెగ చూసేస్తున్నారు నెటిజన్స్. ఇండియా దాటి విదేశాల్లో సైతం అజిత్ సినిమాకు బ్రహ్మరథం పడుతున్నారు. దాంతో ఈ సినిమా రిలీజైనప్పటి నుంచి, నెట్ ఫ్లిక్స్ లో ట్రెండ్ లోనే ఉంటుంది.

తెగింపుకు ఇలాంటే క్రేజ్ కంటిన్యూ అయితే మాత్రం, రాబోయే రోజుల్లో నయా రికార్డులు బద్దలు కొట్టడం ఖాయం.  మొత్తంగా తమిళ దర్శకుడు వినోద్ తెరకెక్కించిన, ఈ హీస్ట్ డ్రామా ఎలాంటి అంచనాలు లేకుండా థియేటర్స్ లోకి వచ్చి, దళపతి విజయ్ నటించిన వారసుడితో పోటీ పడి, భారీ వసూళ్లను అందుకుంది. కోలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర బిగ్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీలోనూ అదే స్థాయిలో షేక్ చేస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement