SS Thaman Said Why He Still Not Working With Prabhas Movie In a Interview- Sakshi
Sakshi News home page

Thaman-Prabhas: ‘లారెన్స్‌ వల్లే ప్రభాస్‌ సినిమా నుంచి తప్పుకున్నా’

Nov 26 2021 12:35 PM | Updated on Nov 26 2021 1:23 PM

SS Thaman Said Why He Still Not Working With Prabhas Movie In a Interview - Sakshi

Thaman Said He Walked Out of Prabhas Movie Due to Director Raghava Lawrence: ఇటీవల ప్రకటించిన భారీ బడ్జెట్‌ చిత్రాల నుంచి సాధారణ చిత్రాల వరకు సింగీత దర్శకుడిగా మ్యూజిక్‌ సెన్సె షన్‌ ఎస్‌ఎస్‌ తమన్‌ పేరు వినిపిస్తోంది. సెకండ్‌ వేవ్‌ తర్వాత స్టార్‌ హీరో సినిమాలు వరసగా క్యూ కడుతున్నాయి. దీంతో తమన్‌ ఫుల్‌ బిజీగా మారాడు. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఒకటుంది. అందేంటంటే చిరంజీవి, బాలకృష్ణ, పవన్‌ కల్యాణ్‌, మహేశ్‌ బాబు వంటి అగ్ర హీరోల సినిమాలకు పని చేసిన తమన్‌ ఇంత వరకుకు ప్రభాస్‌ ఒక్కసినిమాకు కూడా స్వరాలు అందించకపోవడం విచిత్రం.  

చదవండి: మరో వివాదాస్పద పాత్రతో సమంత హాలీవుడ్‌ ఎంట్రీ..

ప్రస్తుతం ప్రభాస్‌ దేశ వ్యాప్తంగా ఎంతో క్రేజ్‌ సంపాదించుకున్నాడు. బాహుబలితో పాన్‌ ఇండియా స్టార్‌ ఎదిగిన ప్రభాస్‌ చేతిలో భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇక స్పిరిట్‌ మూవీతో ఇంటర్నేషనల్‌ స్థాయి ఎదగనున్నాడు. ఈ నేపథ్యంలో ప్రభాస్ సినిమాలో తమన్ ఇంతవరకూ సంగీతాన్ని అందించకపోవడం ఎవరికైనా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అయితే ప్రభాస్‌తో కలిసి పనిచేయకపోవడానికి కారణమేదైనా ఉందా అనే సందేహం కూడా కలుగుతుంది.

చదవండి: ఎట్టకేలకు విడాకులపై స్పందించిన ప్రియాంక-నిక్‌ జోనస్‌

ఈ క్రమంతో ఇటీవలో ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తమన్ ఈ విషయంపై స్పందించాడు. ఈ సందర్భంగా ప్రభాస్ ‘రెబల్’ సినిమాకి పనిచేసే అవకాశం వచ్చిందన్నాడు. చివరకు ఆ సినిమాకి సంగీతం కూడా తానే చేయాలని లారెన్స్ అనుకన్నాడు. దీంతో నేను ఆ సినిమా నుంచి తప్పుకోవాల్సి వచ్చిందన్నాడు. అప్పటి నుంచి ఆయనతో ఏ ప్రాజెక్ట్ సెట్ కాలేదన్నాడు. త్వరలో ప్రభాస్ సినిమాకి పనిచేసే అవకాశం వస్తుందని ఆశిస్తున్నానంటూ చెప్పుకొచ్చాడు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement