భారీ బడ్జెట్‌తో శివ కార్తికేయన్‌ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ.. డ్రాప్‌ కాలేదా? | Sivakarthikeyan And Venkat Prabhu Film Latest Update, AR Rahman Likely On Board | Sakshi
Sakshi News home page

భారీ బడ్జెట్‌తో శివ కార్తికేయన్‌ సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ.. డ్రాప్‌ కాలేదా?

May 3 2026 2:27 PM | Updated on May 3 2026 4:57 PM

Sivakarthikeyan And Venkat Prabhu Film Latest Update

కోలీవుడ్‌లో ప్రముఖ స్టార్‌గా రాణిస్తున్న నటుడు శివకార్తికేయన్‌. ఈయన పరాశక్తి చిత్రం తర్వాత దర్శకుడు వెంకట్‌ప్రభు దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యారు. దీనికి సంబంధించిన ప్రకటన కూడా వెలువబడింది. ఇది సైన్స్‌ ఫిక్షన్‌ కథాచిత్రంగా ఉంటుందని పేర్కొన్నారు. దీంతో బడ్జెట్‌  ఎక్కువ అవుతుందనే కారణంగా ఈ చిత్రాన్ని డ్రాప్‌ చేసినట్లు ప్రచారం జరిగింది. 

దీంతో ఇటీవల తాయ్‌ కిళవి చిత్రంతో అనూహ్య విజయాన్ని అందుకున్న శివకుమార్‌ మురుగేశన్‌ దర్శకత్వంలో శివకార్తికేయన్‌ హీరోగా నటిస్తున్నారు. దీనికి సెయోన్‌ అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఇది పక్కా రూరల్‌ కథాచిత్రంగా ఉంటుందని సమాచారం. సంతోష్‌ నారాయణ సంగీతాన్ని అందిస్తున్న ఈచిత్రాన్ని కమలహాసన్‌ తన రాజ్‌ కమల్‌ ఫిలిం ఇంటర్నేషనల్‌ పతాకంపై భారీ ఎత్తున నిర్మిస్తున్నారు.

 ఇదిలా ఉంటే తాజాగా వెంకట్‌ ప్రభు దర్శకత్వంలో శివకార్తికేయన్‌ నటించే చిత్రం డ్రాప్‌ కాలేదని ఆ చిత్రం సమర్పకుడు టీజీ త్యాగరాజన్‌ ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. దీని గురించి ఆయన మాట్లాడుతూ ఈ చిత్రానికి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందించడానికి చర్చలు జరుగుతున్నట్లు చెప్పారు. అదేవిధంగా చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయని చెప్పారు. ఈ చిత్రం డ్రాప్‌ కాలేదని చెప్పారు.  

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement