Orey Bammardhi: ఎవరితోనూ నిజాయతీగా ఉండలేకపోతున్నాను | Siddharth Orey Bamardhi Movie Trailer Out | Sakshi
Sakshi News home page

Orey Bammardhi: ఎవరితోనూ నిజాయతీగా ఉండలేకపోతున్నాను

Aug 4 2021 5:16 PM | Updated on Aug 4 2021 6:18 PM

Siddharth Orey Bamardhi Movie Trailer Out - Sakshi

‘ఈ లోకంలో ఎవ‌రితో ఒకరితోనైనా 200 శాతం హానెస్ట్‌గా ఉండాల‌నుకుంట‌న్నాను’అంటున్నాడు హీరో సిద్ధార్థ్‌. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ఒరేయ్‌ బామ్మర్ది’. ‘బిచ్చగాడు’ చిత్రాన్ని తెరకెక్కించిన శశి ఈ ప్రాజెక్ట్‌ రూపొందిస్తున్నారు. జీవీ ప్రకాశ్‌ కీలకపాత్ర పోషించారు. ఈ చిత్రం ఆగస్ట్‌ 13న థియేటర్లలో విడుదల కానుంది. ప్రచారంలో భాగంగా బుధవారం ఉదయం ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు. 

ఇందులో సిద్దార్థ్‌ ట్రాఫిక్‌ పోలీస్‌ పాత్రలో కనిపించనున్నారు. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో సిద్దార్థ్‌, జీవీ ప్రకాశ్‌ల నటన ఆకట్టుకునేలా సాగింది. బైక్ రేసులంటూ తిరిగే యువ‌కుడి పాత్ర‌లో జీవీ ప్ర‌కాశ్ క‌నిపిస్తే.. న‌గ‌రంలో రేసర్స్‌ను ప‌ట్టుకునే ట్రాఫిక్ ఇన్‌స్పెక్ట‌ర్ పాత్ర‌లో సిద్ధార్థ్ క‌నిపించున్నారు. వీరిద్ధ‌రి మ‌ధ్య ప్రొఫెష‌న‌ల్‌గా..ప‌ర్స‌న‌ల్‌గా ఉండే ట‌చ్‌ను చూపిస్తూ సినిమా ఉంటుంద‌నేది ట్రైల‌ర్‌ను చూస్తే అర్థ‌మ‌వుతుంది.

పోలీస్ లైఫ్‌లో క్రిమినల్స్‌తోనూ, వాళ్లు చేసే క్రైమ్స్‌తోనే బతకాల్సి వస్తుంది. డిపార్ట్‌మెంట్‌ లోపలైనా బయటైనా ఎవరితోనూ నిజాయతీగా ఉండలేకపోతున్నాను. కాబట్టి, ఈ లోకంలో ఎవరో ఒక్కరితోనైనా 200శాతం నిజాయతీగా ఉండాలనుకుంటున్నాను’ అంటూ సిద్ధార్థ్ చెప్పే డైలాగ్స్‌ ఆకట్టుకునేలా ఉన్నాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement