
ప్రముఖ నటుడు మిలింద్ సోమన్ తన 55వ ఏట అడుగుపెట్టారు. అయితే ఈ సందర్భంగా ఈ వయసులో కూడా తాను ఎంత ఫిట్‌గా ఉన్నానో తెలిపేలా ఉండే ఒక పిక్‌ను మిలింగ్ తన సోషల్‌మీడియా ఖాతాలో షేర్ చేశాడు. ఉదయం పూట బీచ్‌లో రన్‌చేస్తూ తన పుట్టిన రోజును ఆహ్వానించాడు మిలింగ్. అయితే దీంట్లో విశేషం ఏముంది అనుకుంటున్నారా? ఆయన ఒంటి మీద నూలిపోగు లేకుండా రన్ చేశారు. 55వ యేట అడుగుపెట్టినప్పటికి తాను చాలా ఫిట్‌గా ఉన్నాను అని ప్రపంచానికి తెలియజేయడానికే మిలింగ్ తన పూర్తి శరీరాన్ని చూపిస్తూ ఫోటోకు ఫోజిలిచ్చారు. అయితే ఈ ఫోటోలు తీసింది తన భార్యే అని ఆయన తన సోషల్ మీడియాలో తెలిపారు.
Happy birthday to me 😀
— Milind Usha Soman (@milindrunning) November 4, 2020
.
.
.
55 and running ! 📷 @5Earthy pic.twitter.com/TGoLFQxmui
ఈ ఫోటోలో తమ అభిమాన నటుడి ఫిట్‌నెస్ చూసి ఆయన ఫ్యాన్స్ చాలా మంది సంతోషపడుతుంటే మరికొంత మంది మాత్రం ఫన్నీ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. లోదుస్తుల బొమ్మలు పెడుతూ ఇదిగోండి ఇవి వేసుకోండి అంటూ పోస్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ మీమ్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరో మీమ్‌లో లాలుప్రసాద్ యాదవ్ మిలింద్‌కు లోదుస్తులు ఇస్తున్నట్లు ఉంది. ఈ మీమ్స్ ప్రస్తుతం ట్రెండ్ అవుతూ నవ్వులు పూయిస్తున్నాయి. ఇవే ఫోటోలను సోమన్ భార్య అంకిత కోన్వర్ కూడా షేర్ చేస్తూ తన భర్తకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది.
చదవండి: ఆమె అన్ని పాత్రలకి సూ‘టబు’ల్..