సంగీత దిగ్గజం శంకర్ మహదేవన్ (Shankar Mahadevan) లగ్జరీ కారు కొన్నాడు. ఎంజీ ఎమ్ 9 ఎలక్ట్రిక్ కారును తన గ్యారేజీకి తీసుకొచ్చాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందులో శంకర్ మహదేవన్.. కొత్త కారును ఇంటికి తీసుకొచ్చి హారతిచ్చాడు. అనంతరం కారు ముందు దర్జాగా నిలబడి ఫోటోలకు పోజిచ్చాడు.
కారు
ఎంజీ ఎమ్9 మోడల్‌లో సీట్ మసాజ్, డ్యుయెల్ సన్‌రూఫ్, హీటింగ్, వైర్‌లెస్ చార్జింగ్ వంటి అనేక సదుపాయాలున్నాయి. సౌండ్ సిస్టమ్ కూడా అదిరిపోతుంది. కేవలం 30 నిమిషాల్లోనే దాదాపు 80 శాతం చార్జ్ అవుతుంది. ఒక్కసారి చార్జ్ చేస్తే 548 కి.మీ ప్రయాణించవచ్చు. ఈ కారు ధర రూ.80 లక్షల పైనే ఉంటుందని తెలుస్తోంది.
సింగర్‌గా, సంగీత దర్శకుడిగా..
శంకర్ మహదేవన్ 1967లో జన్మించాడు. బాల్యంలోనే హిందూస్థానీ శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతం నేర్చుకున్నాడు. చదువు పూర్తవగానే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేశాడు. కొంతకాలానికి ఉద్యోగానికి రాజీనామా చేసి సంగీత ప్రపంచంలో అడుగుపెట్టాడు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠి, తుళు, పంజాబీ, హిందీ భాషల్లో అనేక పాటలు ఆలపించాడు. ఉట్టిమీద కూడు, ఏమి చేయమందువే.., ఒకటే జననం ఒకటే మరణం.., స్నేహమంటే ఇదేరా, ఓం మహాప్రాణ దీపం.., భం భం బోలే.., చంద్రుల్లో ఉండే కుందేలు.. అఖండ టైటిల్ సాంగ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన పాడిన పాటలు చాలానే ఉన్నాయి. అలాగే ఎన్నో సినిమాలకు ఆయన మ్యూజిక్ కూడా అందించాడు.
చదవండి: కల్యాణ్‌ను పొడిచేసిన శ్రీజ.. నామినేషన్స్‌లో ఎవరున్నారంటే?


