బాద్‌షా ఫ‍్యాన్స్‌కు బిగ్ షాక్.. పఠాన్ మువీ వాయిదా..! | Sakshi
Sakshi News home page

KRK Tweet On Pathaan Movie: ఇకపై ఆ టైటిల్, సాంగ్ కనిపించవు.. కేఆర్కే సంచలన ట్వీట్

Published Tue, Jan 3 2023 9:19 PM

Shah Rukh Khan Pathaan release postponed titled changed by KRK - Sakshi

కేఆర్కే (కమల్ ఆర్ ఖాన్) బాలీవుడ్‌లో పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఎందుకంటే ఎంత పెద్ద సినిమా అయినా సరే తన సంచలన రివ్యూలతో వార్తల్లో నిలుస్తుంటారు. అతను ఇచ్చే ప్రతి రివ్యూ వివాదానికి దారి తీసేలా ఉంటాయి. బాలీవుడ్‌ సినీ విమర్శకుడిగా పేరొందిన ఆయన అసలు పేరు కమల్‌ ఆర్‌ ఖాన్‌. ఇండస్ట్రీలో కేఆర్కేగానే ఫేమస్ అందరికీ తెలుసు. తాజాగా కేఆర్కే షారూఖ్ ఖాన్ మూవీ పఠాన్‌పై ఆసక్తకర వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఆ సినిమాలోని బేషరాం రంగ్ తీవ్ర వివాదానికి దారి తీసిన సంగతి తెలిసిందే. 

ఈ నేపథ్యంలోనే కేఆర్కే మరోసారి వార్తలో నిలిచారు. ఇకపై షారూక్ సినిమా టైటిల్ పఠాన్, 'బేషరం రంగ్' సాంగ్ కనిపించవంటూ కామెంట్స్ చేశారు. పఠాన్ మూవీ కూడా వాయిదా వేస్తారని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ బీ-టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. కానీ అంతకుముందే షారూక్‌ ఖాన్, దీపికా పదుకొణె నటించిన మూవీ పఠాన్‌ రివ్యూ తన చివరిదని స్పష్టం చేశారు.  

కేఆ‍ర్కే ట్వీట్ చేస్తూ.. 'పఠాన్ టైటిల్ ఇక ఉండదు. అలాగే ఆరెంజ్ బికినీ కూడా ఇందులో కనిపించదు. ప్రస్తుతం  ఈ సినిమా విడుదలను వాయిదా వేయాలని నిర్మాతలు నిర్ణయించారు. ఈరోజు లేదా రేపు అధికారిక ప్రకటన రావొచ్చు.' అంటూ పోస్ట్ చేశారు. మరి దీనిపై చిత్రబృందం ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే. 

Advertisement
 
Advertisement
 
Advertisement