
టాలీవుడ్ స్టార్ హీరోయిన్, అక్కినేని కోడలు సమంత సినిమాలతో పాటు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తనకు సంబంధించిన ఫొటోలను షేర్ చేస్తూ అభిమానులను పలకరిస్తూ ఉంటుంది. ఇక ఫొటోషూట్‌కు ఫోజులు ఇస్తూ ఎప్పటికపుడు ట్రెండీ లుక్‌లో సందడి చేసే తాజాగా స్టైలిష్ లుక్ అందరిని కట్టిపడేసింది. ఫ్యాషన్ ప్రపంచానికే ఐకాన్ అనిపించేంతగా సరికొత్త లుక్‌లో దర్శనం ఇచ్చింది. సామ్ లూయిస్ వుయిట్టన్ అవుట్‌ఫిట్‌లో ఫొటోషూట్‌కు ఫోజులు ఇచ్చిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పంచుకుంది.
చదవండి: పెళ్లిపై స్పందించిన రాశి ఖన్నా, కాబోయేవాడు అచ్చం తనలాగే..
బ్లాక్ స్లీవ్‌లెస్ టాప్, డిజైన్‌డ్ జాగర్స్‌లో స్టైలిష్‌గా ఆమె ఫొటోలకు ఫోజులు ఇచ్చింది. ఈ ఫొటోలను చూసి ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్రీతమ్ జుకాల్కర్ డిజైన్ చేసిన ఈ డిజైనర్ వేర్‌తో సామ్ ఒక్కసారిగా సోషల్ మీడియా అటెన్షన్‌ను తనవైపు తిప్పుకుంది. మరోవైపు ఆమె చేతిలో ఉన్న లూయిస్ వుయిట్టన్ లగేజ్ బ్యాగ్, కాళ్లకు వేసుకున్న గోధుమ రంగు షూ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. దీంతో అందరి చూపు దానిపై వెళ్లడంతో వాటి ఖరీదు ఎంతో తెలుసుకునే పడిలో పడ్డారు నెటిజన్లు. అంతలా సామ్ లుక్‌ను రెట్టింపు చేసిన ఈ బ్యాగ్, షూల ఖరీదు తెలిసి అందరూ అవాక్కవుతున్నారు. ఇంతకి వాటి ఖరీదు ఎంతో మీరు కూడా తెలుసుకోవాలనుకుంటున్నారా?. ఆ బ్యాకు ఖరీదు రూ.2.5 లక్షలు కాగా.. బూట్ల విలువ రూ.1.5 లక్షలుగా సమాచారం.
చదవండి: అలా ఏడిస్తే హౌజ్ నుంచి ముందుగా వచ్చేది నువ్వే: కౌశల్
ఇలా స్టైలిష్‌గా ఖరీదైన వస్తువులతో ఫోజులు ఇచ్చిన సామ్ ఫొటోలు చూస్తుంటే హాలీవుడ్ మోడల్‌ను తలపిస్తోంది. దీంతో ఈ ఫొటోలు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. సమంత ప్రస్తుతం పౌరాణిక పురాణ ప్రేమ కథ ఆధారంగా తెరకెక్కుతున్న శాకుంతలంలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. గుణశేఖర్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ చిత్రీకరణ ఇటీవలే పూర్తయింది. మరోవైపు తమిళ దర్శకుడు విఘ్నేశ్ శివన్ డైరెక్షన్ తెరకెక్కతోన్న కాతువాకుల రెండు ఖాదల్ మూవీలో నటిస్తోంది. ఇందులో నయనతార, విజయ్ సేతుపతిలు కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.